ఈ మధ్య కాలంలో సినీ నటులు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అలాంటి విషయమే ఒకటి చోటు చేసుకుంది. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వెటరన్ యాక్టర్ బ్రూస్ విల్లీస్ అస్వస్థత కారణంగా ఏడాది కిదట తన నట జీవితానికి విరామం తీసుకున్న విషయం విధితమే. బ్రూస్ విల్లీస్ అఫాసియాతో బాధపడుతున్నట్టు నటుడి కుటుంబం తెలిపింది. ఇప్పుడు బ్రూస్ విల్లీస్ ఆరోగ్యం మరింత విషమించిందని తెలుస్తోంది.
Advertisement
తాజాగా బ్రూస్ విల్లీస్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబం మరో ప్రకటన కూడా చేసింది. అఫాసియా తరువాత బ్రూస్ కి ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా కూడా ఉన్నట్టు నిర్దారణ అయినట్టు కుటుంబం చేసిన ప్రకటనలో వెల్లడించింది. 2022లో బ్రూస్ కి అఫాసియా ఉందని ప్రకటించిన తరువాత అతని పరిస్థితి మెరుగుపడింది. బ్రూస్ కి ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే వ్యాధి కూడా ఉన్నదని తేలడంతో ఆయన అభిమానులలో ఆందోళన నెలకొంది. కమ్యూనికేషన్ లో ఇబ్బంది పడటం ఈ వ్యాధి లక్షణం అని అంటున్నారు. ఇది చాలా బాదకరమైనదిగా ఉంటుందని పేర్కొంటున్నారు. బ్రూస్ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన కుమార్తె రూమర్ విల్లిస్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. భాషకు సంబంధించిన మెదడులోని ప్రాంతాలను ప్రభావితం చేసే రుగ్మతలకు ఈ జబ్బు కారణమవుతుందని పేర్కొన్నారు.
Advertisement
Also Read : హీరో నితిన్ నుండి ఆలీ వరకు అంగవైకల్యం ఉన్న హీరోలు వీళ్ళే..!!
అంతేకాదు.. వ్యక్తిత్వ మార్పులు, మాట్లాడడం కష్టమవ్వడం, భాషకు సంబంధించిన మెదడులోని ప్రాంతాలను ప్రభావితం చేసే సమస్యలను కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. యాక్షన్ హీరో బ్రూస్ విల్లీస్ 1980లో తన నటన జీవితాన్ని ప్రారంభించారు. అప్పుడు నటుడు బ్రూస్ విల్లీస్ తన అత్యంత ప్రజాదరణ పొందిన డై హార్డ్ సిరీస్ కి బాగా ఫేమస్ అయ్యాడు. ఈయన సుదీర్ఘ కెరీర్ లో అవుట్ ఆఫ్ డెత్, దివెర్డిక్ట్, మూన్ లైలింగ్, ది బాక్సింగ్, హోస్టేజ్, గ్లాస్ వంట సినిమాలలో కూడా నటించారు.
Also Read : ఆదిపురుష్ పై హీరోయిన్ కృతిసనన్ ఏమన్నారంటే..?