ఇన్ స్టా, ఫేస్బుక్ యూజర్లకు దిమ్మ తిరిగే షాక్. సోషల్ మీడియా సంస్థల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ పేరిట ట్విట్టర్ యూజర్ల ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తుంది. తాజాగా మెటా సంస్థ కూడా ఇదే బాట పట్టింది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్ల అకౌంట్ ధ్రువీకరణ కోసం సబ్ స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతున్నట్టు మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ ఆదివారం ప్రకటించారు. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ సర్వీస్ ను ప్రవేశపెడతామన్నారు.
Advertisement
మార్క్ ప్రకటన ప్రకారం, ఈ సర్వీస్ కోసం నెలనెలా వెబ్ యూజర్లు 11.99 డాలర్లు చెల్లించాలి. ఐఓఎస్ యుజర్ల నెలవారి బిల్లు 14.99 డాలర్లు. ఈ సర్వీస్ తో యూజర్లు తమ అకౌంట్లను ప్రభుత్వం కేటాయించిన గుర్తింపు కార్డులతో మెటా ధ్రువీకరణ పొందవచ్చు. వెరిఫికేషన్ పూర్తయిన అకౌంట్లోకి ‘బ్లూ బ్యాడ్జ్’ కేటాయిస్తారు. అంతే కాకుండా సబ్ స్క్రిప్షన్ ఉన్న అకౌంట్లకు నకిలీల బెడద లేకుండా ఫేస్బుక్ అదనపు భద్రత కల్పిస్తుంది. నేరుగా కస్టమర్ కేర్ తో సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది.
Advertisement
తోలుతా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ఈ సబ్ స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతున్నట్లు మార్క్ తెలిపారు. విడతల వారీగా అన్ని దేశాలకు విస్తరిస్తామన్నారు. అయితే, మెటా వెరిఫైడ్ బ్లూ టిక్ పొందడం కోసం 18 ఏళ్ళు లేదా ఆ పైబడిన వయస్కులే అర్హులు. మీరు సమర్పించిన ప్రభుత్వ ధృవపత్రంలోని పేరు, ఫోటోతో మీ ఫేస్బుక్ లోని పేరు, ఫోటోను పోల్చి చూస్తారు. ట్విట్టర్ బ్లూ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
READ ALSO : ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ప్రాజెక్ట్ కె మరో బిగ్ అప్డేట్