సాధారణంగా స్టార్ సెలబ్రెటీలు పబ్లిక్ ప్లేస్ లోకివస్తే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మామూలుగా ఎవరైనా స్టార్ హీరో రోడ్లపైకి వచ్చారంటే అక్కడున్న అభిమానులు తమ అభిమాన నటులను చూసి.. వారితో ఫోటోలు దిగడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో అభిమానులు ఎగబడి ఒక్కసారిగా మీది మీదికి వస్తుంటారు. అలాటి ఘటన స్టార్ హీరో అల్లు అర్జున్ కి ఒకటి ఎదురైంది.
Advertisement
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా, ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ సినిమాల కోసం అభిానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటిది బన్నీ బయట కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఎప్పుడు ఆయనను కలవాలి ఆయనతో ఫోటోలు దిగాలి అని చూస్తుంటారు. ఆయన ఏదైనా సినిమా ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఆ వేదిక మీదికి అడుగుపెడితే చాలు వెంటనే అభిమానులు ఆనందంతో అల్లర్లు చేస్తుంటారు. ఇక ఇదంతా పక్కకు పెడితే తాజాగా అల్లు అర్జున్ తన అత్తగారింటికి వెళ్లాడు. అత్తగారింటి వద్ద కూడా అభిమానులు అల్లు అర్జున్ ని చూసేందుకు ఎగబడ్డారు. ఇంతకు ఆయన అక్కడికి ఎందుకు వెళ్లాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి జన్మస్థలం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం, చింతపల్లి గ్రామం. స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తోటి అల్లుడు నామిరెడ్డి వీరారెడ్డి మూడు రోజుల కిందట మరణించాడు.దీంతో చిన్న మామయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో సహా చింతపల్లి గ్రామానికి చేరుకున్నాడు. చిన్నమామ వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాదు.. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాడు. ఇక ఆ తరువాత పక్కనే ఉన్నటువంటి అత్తగారింటికి వెళ్లి రెస్ట్ తీసుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ చింతపల్లి గ్రామానికి వచ్చాడనే విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్ తో ఫోటోలు దిగడానికి ప్రయత్నించారు. అల్లు అర్జున్ బౌన్సర్లు అభిమానులను అడ్డుకోవడంతో వాళ్లు ఫీలయ్యారు.అల్లు అర్జున్ బయలుదేరుతుండగా కొందరూ వీడియోను తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.