గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కాపీరైట్స్ కేసులో ఇరుక్కున్నారు. ఆయనపై కేసు కూడా నమోదు అయింది. ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా అనే సినిమాను తమ అనుమతి లేకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటూ కోర్టు మెట్లు ఎక్కారు మేకర్స్. విచారణకు స్వీకరించిన కోర్టు సుందర్ పిచాయ్తో పాటు ఐదుగురు కంపెనీ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందిగా ముంబై పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Advertisement
Advertisement
అయితే తన సినిమా హక్కులను ఎవరికీ అమ్మలేదంటూ కోర్టుకు వెళ్లిన మేకర్స్ తమ అనుమతి లేకుండానే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో యూట్యూబ్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. స్పందన లేదు అని.. అందుకే తాను ఈ చర్యకు దిగానని వెల్లడించారు. ఏక్ హసీనా థి ఏక్ దివానా థా మూవీలో 2017లో విడుదల చేశారు. ఇది పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మేకర్స్ ఇప్పుడు కోర్టుకు ఎక్కడం.. కేసులు నమోదు కావడం పెద్ద చర్చగా మారింది.