కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఇలా చేయడం మంచిది. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడితే ముఖం చూడడానికి అసలు బాగోదు. పైగా అందం బాగా దెబ్బతింటుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మరి కళ్ళ కింద నల్లటి వలయాలు పోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కీరదోస ముక్కలు ఇందుకు బాగా పనిచేస్తాయి కీరదోస ముక్కలని చక్రాల కింద కట్ చేసి ఫ్రిజ్లో కొంచెం సేపు పెట్టి కళ్ళ కింద పెట్టుకోవాలి.
Advertisement
Advertisement
ఇలా చేస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బంగాళదుంప కూడా బాగా పనిచేస్తుంది. బంగాళదుంప ముక్కలను చక్రాల కింద కట్ చేసి కళ్ళ కింద పెట్టుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. గ్రీన్ టీ, బ్లాక్ టీ కూడా బాగా పనిచేస్తాయి. టీ బ్యాగుల ని ఫ్రిజ్లో పెట్టి తర్వాత కళ్ళ కింద పెట్టుకుంటే ఈ సమస్య ఉండదు. బాదం నూనె కూడా చక్కగా పనిచేస్తుంది బాదం నూనెని కళ్ళ కింద రాసుకుంటే కళ్ళ కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. పసుపులో కొంచెం పాలు రోజ్ వాటర్ వేసి కళ్ళ కింద రాసుకుంటే కళ్ళకింద వలయాలు తొలగిపోతాయి. ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు.
Also read:
- షుగర్ తో బాధపడుతున్నారా..? వీటిని తీసుకుంటే.. కంట్రోల్ అవుతుంది…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఎలాంటి ప్రయత్నం చేసినా విజయం పక్కా..!
- నాని సినిమాల్లో లాభాలుండవ్ ..నిర్మాత రిప్లై చూసి ఆశ్చర్యపోయిన జనాలు..!