Home » Sree Leela : ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !

Sree Leela : ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. అలా ఒకటి రెండు సినిమాలతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా ఎదిగిపోయింది శ్రీ లీల.

Advertisement

కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ లీల… శ్రీకాంత్ కొడుకు నటించిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా… రవితేజ నటించిన ధమాకా సినిమాతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీ లీల. ధమాకా తర్వాత శ్రీ లీల కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి.

Advertisement

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందని సమాచారం అందుతోంది. హీరోయిన్ శ్రీ లీలకు బాగా తుమ్మే వ్యాధి ఉందట. ఒక్కసారి తుమ్మితే దాదాపు 15 సార్లు అలా వరుసగా తుమ్ములు వస్తూనే ఉంటాయట. కెరీర్ ప్రారంభంలో ఈ సమస్య కారణంగా చాలా సినిమాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని తాజాగా శ్రీ లీల చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికి కూడా ఆ వ్యాధి అలాగే ఉందని… దానికి శ్రీ లీల ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని కూడా తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading