డెంగ్యూ జ్వరంతో ప్రపంచకప్ తొలి మ్యాచ్ కు దూరమైన టీమిండియా ఓపెనర్ గిల్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే రెండో మ్యాచ్ కు కూడా దూరంగా ఉంటాడని బీసీసీఐ ధ్రువీకరించింది. టీమిండియా ఓపెనర్ గిల్ ప్రస్తుతం చెన్నైయ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. డెంగ్యూ కారణంగా గిల్ కు ప్లేట్ లెట్స్ తగ్గాయట. అందుకే గిల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు బుధవారం భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా పాకిస్తాన్ తో తలపడనుంది. ఆ మ్యాచ్ కు అయినా గిల్ అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి.
గిల్ లేని లోటు వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. గిల్ స్థానంలో ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ కీలకమైన చేజింగ్ లో విఫలమయ్యారు. వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో గోల్డెన్ డక్ సాధించిన తొలి భారత ఓపెనర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో తొలి మ్యాచ్ ఆడిన భారత్ టాపార్డర్ కుప్పకూలిపోయింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్, శ్రేయస్ అయ్యర్ జీరో స్కోరుకే పెవీలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడి అదరగొట్టింది. టెస్ట్ మ్యాచ్ తరహాలో ఆడుతూ సింగిల్ తీస్తూ స్కోర్ బోర్డ్ ను పెంచుకుంటూ పోయారు.
Advertisement
Advertisement
ఒక దశలో కోహ్లీ క్యాచ్ ను మార్ష్ మిస్ చేయడంతో టీమిండియా లైఫ్ దక్కింది. అక్కడి నుంచి కోహ్లీ ఆచితూచి సింగిల్స్ కే జై కొట్టాడు. మరోసారి KL రాహుల్ సింగిల్స్ కొట్టి కోహ్లీకి ఉడుత సాయం చేస్తూ వచ్చారు. వీరిద్దరూ చివరివరకు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివర్లో కోహ్లీ అవుట్ అయినప్పటికీ రాహుల్ నిదానంగా ఆడుతూ కనిపించాడు. హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే సిక్స్ కొట్టాడు. అప్పటికే జట్టు విజయం ఖాయమైంది. చివర్లో రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో జోష్ నింపాడు. మొత్తానికి 2023 ప్రపంచకప్ తొలి మ్యాచ్ కు అసిస్ ను చిత్తు చేసి భారత్ బోణి కొట్టింది.
ఇవి కూడా చదవండి
- జార్వో 69కి షాకిచ్చిన ICC… వరల్డ్ కప్ మ్యాచ్లు చూడకుండా శిక్ష..!
- World Cup 2023 : రాహుల్ సెంచరీ మిస్.. పాండ్యా స్టైలీష్ అంటూ విమర్శలు
- కొడుకులు పుట్టాలంటే ఇలా చేస్తే సరిపోతుంది…3వది చాలా ముఖ్యం?