Home » చిరంజీవికి పేరు లేని సినిమా ఉందనే విషయం మీకు తెలుసా ?

చిరంజీవికి పేరు లేని సినిమా ఉందనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఒక సినిమా ప్రారంభమైందంటే .. అందులో హీరో పేరు ఏంటి అని అడుగుతుంటారు అభిమానులు. ఏ క్యారెక్టర్ లో నటిస్డున్నాడు.. స్టోరీ ఏంటి అని రకరకాల ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఎందుకంటే తమ హీరో పేరు ఏమిటో.. ఏ క్యారెక్టర్ అనే విషయాలను తెలుసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటిది కొన్ని సినిమాల్లో హీరో పేరు అస్సలు పెట్టరు దర్శకులు. ముఖ్యంగా కథ రాసుకునేటప్పుడు హీరో పేరు లేకుండా రాసుకుంటారు.  వినడానికి మనకు విచిత్రంగా ఉన్నప్పటికీ కొన్ని తెలుగు సినిమాల్లో ఇదే జరిగింది. మనకు తెలిసిన స్టార్ హీరోలు కొన్ని సినిమాల్లో పేరు లేకుండానే నటించారు. ఆ సినిమాలలో ఒక్కరూ కూడా ఆయా హీరోలను పేరు పెట్టి పిలవరు. 

Advertisement

ఉదాహరణకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమానే తీసుకోండి. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా 2005లో విడుదలైంది. ఈ చిత్రానికి యావరేజ్ కలెక్షన్లు లభించాయి. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన అర్జున్ కేవలం ఒకవర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఒక్కసారి కూడా మహేష్ బాబును ఎవ్వరూ పేరు పెట్టి పిలవరు. సినిమా ఎండ్ కార్డ్స్ సమయంలో తన పేరు అర్జున్ అంటూ మహేష్ బాబు రివీల్ చేయడం గమనార్హం. అప్పటివరకు ఆ విషయాన్ని ఎవ్వరూ గమనించరు కూడా. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాగే ఓ సినిమాలో నటించాడు. 

Advertisement

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిన రాక్షసుడు మూవీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. దాదాపు 35 ఏళ్ల కిందట 28 సెంటర్లలో 100 రోజులు ఆడింది రాక్షసుడు సినిమా. ఈ చిత్రంలో చిరంజీవిని ఎవ్వరూ పేరు పెట్టి పిలవరు. నాగబాబు ఫ్రెండ్ అని పిలుస్తుంటారు. హీరోయిన్ రాధా పురుష అని పిలుస్తుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఎవ్వరూ పేరు పెట్టి పిలవకపోవడం గమనార్హం. అసలు ఈ చిత్రంలో క్యారెక్టర్ పేరు లేకుండానే నటించాడు చిరంజీవి. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా హీరోలకు పేర్లుండవు. చిన్నోడా.. పెద్దోడా అని మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఆయా సినిమాలు చూస్తున్న సమయంలో ప్రేక్షకులు పెద్దగా గమనించరు. తరువాత వీటి గురించి ఇలా తెలుసుకున్నప్పుడు మనకు చాలా విచిత్రంగా ఉంటుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రెండుసార్లు సెన్సార్ అయి కూడా చిరంజీవి పరువు తీసిన సినిమా ఏదో తెలుసా ?

ఏపీలో ఎన్టీఆర్ సినిమాలను నిలిపివేస్తారా..? అభిమానులు ఏమంటున్నారంటే..?

Visitors Are Also Reading