Home » గిల్ త్వరగా కోలుకోవాలని సచిన్ కూతురు ప్రార్థనలు !

గిల్ త్వరగా కోలుకోవాలని సచిన్ కూతురు ప్రార్థనలు !

by Bunty

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ ప్రస్తుతం భయంకరమైన డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల కిందట గిల్ కు డెంగ్యూ వ్యాధి సోకినట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడు అధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు అకాడమీలో గిల్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.

డెంగ్యూ సోకిన నేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మ్యాచ్ కు గిల్ దూరమయ్యాడు. దీంతో ఈశాన్ కిషన్… గిల్ స్థానంలో టీమిండియాలోకి వచ్చేసాడు. అయితే టీమిండియా క్రికెటర్ గిల్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

Shubman Gill could miss a couple of matches in the World Cup due to dengue fever

Shubman Gill could miss a couple of matches in the World Cup due to dengue fever

గిల్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి… గెట్ వెల్ సూన్ అంటూ రాస్కొచ్చారు సారా టెండూల్కర్. అంటే టీమిండియా క్రికెటర్ గిల్ త్వరగా కోలుకోవాలని… త్వరగా జట్టులో చేరాలని కోరుకుంటున్నాను అని సారా టెండూల్కర్ చెప్పకనే చెప్పారు. అయితే సారా చేసిన ఆ ట్విట్టర్ అకౌంట్… అసలు ఆమెదేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. కాగా సారా టెండూల్కర్ మరియు క్రికెటర్ గిల్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సారా టెండూల్కర్ ఈ పోస్ట్ పెట్టడంతో వీరి మధ్య ప్రేమ మరింత బలపడినట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading