పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య హైదరాబాద్లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ చాలా సులభంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ పాకిస్తాన్ ప్లేయర్లను డచ్ ప్లేయర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఆటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్ లో అంత తేలిగ్గా తలోగ్గకుండా చాలా సేపు టెన్షన్ పెట్టారు. ప్రత్యేకించి ఓ ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి అతని పేరు ‘బాస్ డి లీడ్’ ఆల్ రౌండర్. అతను బౌలింగ్ లో నాలుగు టికెట్లు తీసి పాకిస్తాన్ ను నానా ఇబ్బందులు పెట్టాడు.
ఉప్పల్ పిచ్ పై చాలా 300 పరుగులు చేస్తుందనుకున్న పాకిస్తాన్ ని 38 పరుగులకే మూడు వికెట్లు తీసి మిగిలిన డచ్ బౌలర్లు ఓ ఆటాడుకుంటుంటే మ్యాచ్ సెట్ చేసి హాఫ్ సెంచరీతో పాకిస్తాన్ ను నిలబెట్టిన రిజ్వాన్ ను అవుట్ చేశాడు. ఈ బాస్ డి లీడ్ రిజ్వాన్ మాత్రమే కాదు షాదాబ్ ఖాన్, హసన్ అలీ వికెట్లు తీసి పాక్ ని కేవలం 286 పరుగులకే ఆల్ అవుట్ చేయడంలో బాస్ డి లీడ్ దే కీలకమైన పాత్ర. ఆ తర్వాత బ్యాటింగ్ లోను అదరగొట్టాడు ఈ 23 ఏళ్ల యంగ్ ప్లేయర్. ఓ టైంలో నెదర్లాండ్స్ టార్గెట్ ను చేజ్ చేస్తుందా అని అనిపించిందంటే దానికి కారణం అతడే. 68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి పాకిస్తాన్ ను భయపెట్టాడు. బాస్ డి లీడ్ ఓ వరల్డ్ కప్ మ్యాచ్ లో నాలుగు టికెట్లు తీసి ఓ హాఫ్ సెంచరీ చేసిన నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ గా నిలిచాడు.
Advertisement
Advertisement
అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా…… బాస్ డి లీడ్ తండ్రి టిం డి లీడ్ కూడా క్రికెటరే. నెదర్లాండ్స్ తరఫున 29 వన్డేలు ఆడిన టిం డి లీడ్ 2003 వన్డే వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో మన వాళ్ళని ఓ ఆట ఆడుకున్నాడు. ఆ మ్యాచ్ లో టీం డీ లీడ్ దాటికి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ అవుట్ కాగా…… ఆ మ్యాచ్లో 206 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బౌలింగ్లో శ్రీనాథ్, అనిల్ కుంబ్లే రెచ్చిపోయి చెరో నాలుగు వికెట్లు తీశారు. కాబట్టి నెదర్లాండ్స్ 136 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కానీ 2003 వరల్డ్ కప్ లో భారత్ కు గోరపరాభావమే ఎదురయ్యేది. మొత్తం మీద అప్పుడు తండ్రి భారత్ ను వణికిస్తే, ఇప్పుడు కొడుకు పాకిస్థాన్ ను భయపెట్టాడు అన్నమాట.
ఇవి కూడా చదవండి
- మహేశ్ “గుంటూరు కారం”లో అనసూయ..?
- నీ అంతు చూస్తా బండారు పై రెచ్చిపోయిన ఖుష్బూ !
- ఎవరీ రచిన్ రవీంద్ర ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు? అనంతపురంతో లింక్ ఏంటి?