హరితేజ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి. ఈమె యాక్టర్ గానే కాకుండా యాంకర్ గాను ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక హరితేజ ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా చలాకీగా అందరితో సరదాగా ఉంటుంది. ప్రతి ఒక్క సినిమాలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి టాప్ 5 లిస్టులో నిలిచింది.
ఇక హరితేజ 2017లో దీపక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ భూమి అనే పాప కూడా జన్మించింది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం హరితేజ చాలా బరువైపోయింది. ఇక నానా కష్టాలు పడి చాలా స్లిమ్ గా మళ్లీ ఎప్పటిలాగే మారిపోయింది. ఇక ఈ అమ్మడు తాజాగా ఆస్ట్రేలియాలో సింగిల్ గా వెకేషన్ మూడ్ ని ఎంజాయ్ చేస్తుంది. తన కూతురు, భర్త లేకుండా చాలా ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఈ మధ్య హరితేజ తన అభిమానులతో చిట్ చాట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ అభిమాని తనను ఓ ప్రశ్న అడిగాడు. మీ భర్తతో మీరు విడాకులు తీసుకున్నారా అని ప్రశ్నించాడు.
Advertisement
Advertisement
దీనికి సమాధానంగా హరితేజ నవ్వుతూ నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే నన్ను కూడా చంపేసేలా ఉన్నారు కదా అని సరదాగా బదిలిచ్చింది. ఇక ఈ వార్తలకు చెక్ పెడుతూ తన భర్త, కూతురుతో కలిసివున్న ఫోటోను పోస్ట్ చేసి ఈ వార్తలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక మీ స్నేహితురాలు నవ్యతో మీరు విడిపోయారా అని ఓ నెటిజన్ అడగ్గా… దానికి సమాధానంగా హరితేజ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ అమ్మడు ప్రతి ఒక్క సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.
ఇవి కూడా చదవండి
- మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..నటి మహాలక్ష్మి సంచలన వ్యాఖ్యలు
- Bigg Boss 7 నుంచి రతిక ఔట్.. అయినా గట్టిగా రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలు అంటే ?
- కోహ్లీ పర్సనల్ ఎమర్జెన్సీ ..గౌహతి నుంచి ముంబైకి వెళ్లిన కింగ్