Home » Pooja Hegde : తెలుగు ఇండస్ట్రీకి పూజా హెగ్డే గుడ్ బై..?

Pooja Hegde : తెలుగు ఇండస్ట్రీకి పూజా హెగ్డే గుడ్ బై..?

by Bunty
Ad

పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా అనంతరం వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అలా వైకుంఠపురం సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement

ఇక ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెంచుకుంది. ఇక గత సంవత్సరం నుంచి ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో పూజ క్రేజ్ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ భామ బాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు వెళ్ళింది. బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. సల్మాన్ ఖాన్ సరసన ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

ఇక ఈ అమ్మడు కూడా ఎక్కువగా తెలుగులో కన్నా హిందీ సినిమాలపైనే ఇంట్రెస్ట్ ను చూపిస్తోంది. ఇక ఈ లేటెస్ట్ గా తెలుగులో మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం వచ్చింది కానీ ఏమైందో తెలియదు ఈ సినిమా నుంచి పూజా తప్పుకుంది. ఇక టాలీవుడ్ లో అవకాశాలు రాకపోయినప్పటికీ పూజ పెద్దగా బాధపడడం లేదట. వస్తే హ్యాపీ లేకపోతే ఇంకా హ్యాపీ అన్నట్టుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక త్వరలోనే ఈ అమ్మడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతోందట.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading