Home » Ram charan: శ్రీహరిని చూసి రామ్ చరణ్ అంత భయపడ్డాడా? అసలు కారణం ఏంటంటే?

Ram charan: శ్రీహరిని చూసి రామ్ చరణ్ అంత భయపడ్డాడా? అసలు కారణం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Ad

మెగాస్టార్ చిరంజీవికి సినిమా ఇండస్ట్రీలో అభిమాని కానివాళ్ళు తక్కువ మందే ఉంటారు. స్వయం కృషితో పైకొచ్చిన చిరంజీవి ఇండస్ట్రీలో అందరితోనూ సన్నిహితంగానే మెలుగుతారు. రియల్ స్టార్ శ్రీహరితో కూడా చిరంజీవికి మంచి అటాచ్మెంట్ ఉంది. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం అయితే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనీ అనుకున్న చిరంజీవి రామ్ చరణ్ ను బాగా ప్రిపేర్ చేసారు.

Advertisement

అలాగే ఫిట్ నెస్ విషయంలో కూడా చిరంజీవి కేర్ తీసుకున్నారు. ఫిట్ నెస్ కి మారు పేరు అయిన శ్రీహరి దగ్గరకి రామ్ చరణ్ ను ట్రైనింగ్ తీసుకోమని పంపించారట. చిరంజీవి మాట మీద శ్రీహరి కూడా రామ్ చరణ్ కు ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నారట. శ్రీహరి ఫిట్ నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయన ప్రతి రోజు రకరకాల ఎక్సర్ సైజ్ లు చేసి బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు. ఇక రామ్ చరణ్ ని కూడా అలానే ట్రైన్ చేయాలనీ శ్రీహరి ఫిక్స్ అయ్యారట.

Advertisement

అందుకే రామ్ చరణ్ చేత కూడా రెండు రోజుల పాటు బాగా వర్క్ ఔట్స్ చేయించారట. ఇక మూడో రోజు శ్రీహరి దగ్గరకు వెళ్ళమని చెప్తే.. రామ్ చరణ్ ఇంక నేను వెళ్ళను అని చిరంజీవికి చెప్పేశారట. శ్రీహరి చేసే వర్క్ ఔట్లు చాలా కఠినంగా ఉండేవి. అందుకే ఆయన దగ్గర ట్రైన్ అవ్వడం చాలా కష్టం అని రామ్ చరణ్ కు అర్ధం అయ్యింది. ఇంత కఠినంగా ఉంటారు కాబట్టే శ్రీహరికి రియల్ స్టార్ అనే బిరుదు కూడా ఉంది. మగధీర సినిమా టైం లో రామ్ చరణ్, శ్రీహరి కలిసి నటించారన్న సంగతి విదితమే. ఆ సినిమా సెట్ లో బ్రేక్ టైం లో వీరు ఆరోజుల్ని గుర్తు చేసుకుని నవ్వుకునేవారట.

మరిన్ని..

Mahalakshmi: డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి..ఎంజాయ్ చేస్తుందిగా..?

నయనతారకు హైదరాబాద్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా….ఏ హీరోకు కూడా పోటీ రాదు!

Vijay Antony Daughter : మీరా చివరి కోరిక తీర్చలేకపోయిన విజయ్ ఆంటోనీ !

Visitors Are Also Reading