ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నాయా..? అయితే ఇలా చేయండి. మీ ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని మీరు ఈ విధంగా తరిమికొట్టేయొచ్చు. ఈజీగా ఈగలు పోతాయి. వానా కాలంలో ఎక్కువగా ఈగలు వస్తూ ఉంటాయి. వాటిని వదిలించుకోవడం కష్టంగా ఉంటుంది. ఈగలు ఎక్కువగా మీ ఇంట్లో ఉన్నట్లయితే ఇలా చేయండి ఈజీగా వెళ్ళిపోతాయి. ఈగల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆహారం మీదకి ఎక్కువగా ఈగలు తరచూ వస్తూ ఉంటాయి. వ్యాధి సంక్రమణకు కారణంగా మారుతాయి. ఈగల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉంటుంది.
Advertisement
Advertisement
ఈగలను వదిలించుకోవాలంటే ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఉప్పు చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్లు ఉప్పు వేసి మిక్స్ చేయండి. లిక్విడ్ని స్ప్రే బాటిల్ లో వేసి ఇల్లంతా పిచికారి చేయండి. ఇలా చేస్తే ఈగలు రావు. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్, డిష్ వాష్ సోప్ కలిపి ఈ గ్లాసుని ఒక ప్లాస్టిక్ కవర్ తో ర్యాప్ చేయండి ఈ కవర్ కి రంధ్రాలు పెట్టండి. ఈగలు రంద్రాలలో నుండి లోపలికి వెళ్లి నీళ్లలో పడిపోతాయి. మళ్లీ బయటికి రాలేవు. ఇంటి ఆవరణలో తులసి పుదీనా మొక్కలు పెంచితే ఈగలు రావు. బిర్యాని ఆకులని ఇంట్లో పొగ వేస్తే కూడా ఈగలు వెళ్లిపోతాయి. ఇలా ఈ సింపుల్ చిట్కాలతో మీరు ఈగలు లేకుండా చూసుకోవచ్చు.
Also read:
- అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా..? దానిమ్మ తొక్కలతో ఇలా చేస్తే సరి..!
- చాణక్య నీతి: ఎప్పటికీ వీటిని రహస్యంగానే ఉంచండి.. లేదంటే చాలా ప్రమాదం..!
- పిల్లలకి ఈ ఆహారపదార్దాలని అస్సలు పెట్టకూడదు.. జాగ్రత్తగా చూసుకోండి..!