మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రతతో చురుకుగా ఉండాలని అనుకుంటుంటారు. అలా ఉంటేనే అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. ఏకాగ్రతని పెంచడానికి, మెదడును రిఫ్రెష్ చేయడానికి కొన్ని పానీయాలు మనకి సహాయం చేస్తాయి మరి ఎటువంటి పానీయాలతో మెదడుని చురుకుగా మార్చుకోవచ్చు అనేది చూద్దాం. గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మెదడు పనితీరు కోసం గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది.
Advertisement
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఆరోగ్యానికి మంచిది ఇది కూడా మెదడుని రిఫ్రెష్ చేస్తుంది. విటమిన్స్, మినరల్స్ వంటివి ఇందులో కూడా ఎక్కువగా ఉంటాయి. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే గోధుమ గడ్డి జ్యూస్ ని కూడా తీసుకోండి. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం నీటిలో కలిపి దీనిని తీసుకుంటే మనసు ఉత్తేజం అవుతుంది ఏకాగ్రత కూడా మెరుగు పడుతుంది.
Advertisement
అలానే మచ్చా టీ కూడా ఏకాగ్రతని పెంచుకోవడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లతో కూడా ఏకాగ్రతని పెంచుకోవచ్చు. పోషకాలు కూడా వీటిలో ఎక్కువ ఉంటాయి. పసుపు పాలు, గ్రీన్ స్మూతీ, చెరుకు రసం కూడా మెదడుని చురుకుగా పనిచేసేలా మారుస్తాయి. మిమ్మల్ని మీరు చురుకుగా మార్చుకోవాలంటే ఈ పానీయాలని తీసుకుంటూ ఉండండి అప్పుడు యాక్టివ్ గా ఉండొచ్చు.
Also read:
- అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా..? దానిమ్మ తొక్కలతో ఇలా చేస్తే సరి..!
- చాణక్య నీతి: ఎప్పటికీ వీటిని రహస్యంగానే ఉంచండి.. లేదంటే చాలా ప్రమాదం..!
- పిల్లలకి ఈ ఆహారపదార్దాలని అస్సలు పెట్టకూడదు.. జాగ్రత్తగా చూసుకోండి..!