Home » పుష్ప సినిమాలో మరో మిస్టేక్ ..! ఆడేసుకుంటున్న నెటిజన్స్ చూసుకోవాలిగా సుకుమార్ గారు అంటూ ట్రోలింగ్ .!

పుష్ప సినిమాలో మరో మిస్టేక్ ..! ఆడేసుకుంటున్న నెటిజన్స్ చూసుకోవాలిగా సుకుమార్ గారు అంటూ ట్రోలింగ్ .!

by AJAY
Ad

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ను విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. అల్లు అర్జున్ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

Advertisement

లారీ డ్రైవర్ సిండికేట్ వ్యాపారిగా ఎలా ఎదుగుతాడు అన్నది పార్ట్ 1 లో చూపించారు. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలోని పాటలకు సైతం అదే స్థాయిలో రెస్పాన్స్ రావడం విశేషం. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమాను త్వరగా విడుదల చేసి సెకండ్ పార్ట్ ను సైతం వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. దాంతో సినిమాలో కొన్ని లాజిక్కులు సైతం సుకుమార్ మిస్ అయ్యారు. దాంతో ఆ లాజిక్ లను పట్టుకొని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత “హే బిడ్డ ఇది నా అడ్డ” అనే పాట ఉంటుంది.

అయితే ఈ పాటలో అల్లు అర్జున్ తనను తానే చేతితో పైకి లేపి నన్ను అయితే కొట్టాడు భూమ్మీద పుట్టలేదు… అది మల్లా నేనే అంటూ చెబుతాడు. ఆ సమయంలో పుష్ప తనను తానే కాలర్ పట్టుకుని పైకి లేపినట్టుగా చూపించాడు. ఇక ఆ కలర్ పట్టే సన్నివేశం వద్ద కలర్ ను పట్టుకుని కనిపించాలి. కానీ ఎడిటర్ ఆ సీన్ వద్ద పప్పులో కాలేశాడు. కాలర్ పట్టుకోకుండా చేయి లోపలికి వెళ్ళి పోతుంది. దాంతో ఈ సీన్ పై ట్రోల్స్ వస్తున్నాయి. సరిగ్గా చూసుకోవాలి కదా సుకుమార్ గారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also read : బ్లాక్ బస్టర్ ‘అరుంధతి’ లాంటి సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading