టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2023 టోర్నమెంటు విజేతగా టీమిండియా గెలిచి… నిలిచి దూసుకుపోతోంది. మొన్న ఆదివారం రోజున ఆసియా కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా పదవి వికెట్ల తేడాతో విజయం సాధించి ఎనిమిదవ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
ఆ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా టీమిండియా చేధించి ఆసియా కప్ ఎగురేసుకుపోయింది. ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జై షా ఆసియా కప్ ను అందించారు. ఆ తర్వాత ఆ ఆసియా కప్ ను టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకు అందించాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత తిలక్ వర్మ నుంచి మరొక వ్యక్తి…ఆ కప్ ను తీసుకున్నాడు. అయితే అతను టీమిండియా జట్టు ప్లేయర్ కాదు. దీంతో ఎవరు అతను అని అందరూ ఆలోచిస్తున్నారు.
Advertisement
Advertisement
అతని పేరు రఘు రాఘవేంద్ర. టీమిండియా బ్యాటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్లకు స్లింగర్ నుంచి బంతులు రిలీజ్ చేసేది రఘు రాఘవేంద్రనే. నిజానికి బౌలర్ల కంటే మన బ్యాటర్లు ఇతడిని ఎక్కువసార్లు ఎదుర్కొంటారు. బ్యాటర్ల స్టైల్ బట్టి… బంతులను రిలీజ్ చేస్తూ ఉంటాడు రఘు. అటు ఫీల్డింగ్ ప్రాక్టీస్ లోను… ప్లేయర్లకు కీలక సూచనలు చేస్తూ ఉంటాడు రఘు రాఘవేంద్ర.
ఇవి కూడా చదవండి
- బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన వసీం అక్రమ్ ! ఇది సరైనదే అంటారా ?
- మహమ్మద్ సిరాజ్ పై శ్రద్ధాకపూర్ సీరియస్.. ఎందుకు ఇలా చేశావంటూ ?
- షకీలాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా?