Home » శివుడు నరికిన వినాయకుడి అసలు తల ఎక్కడుందో తెలుసా ?

శివుడు నరికిన వినాయకుడి అసలు తల ఎక్కడుందో తెలుసా ?

by Anji
Ad

గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా మొదలైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 18 నుంచి  భక్తులంతా గణపతి పూజ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇక చిన్న పిల్లలు అయితే గణనాథుని ముందే  వాలిపోతున్నారు. తొండంతో ఉన్న గణనాథుని చూస్తూ  ఆనందంలో మునిగిపోతున్నారు. అలాంటి గణనాథునికీ ఏనుగు తల ఎలా పెట్టారో ఆ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి గణపతి నిజమైన తల ఎక్కడ ఉంది.. ఏ ప్రాంతంలో శివుడికి గణపతికి  యుద్ధం జరిగింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

శివుడు, గణేశుడు  యుద్ధం చేసిన నేల ఉత్తరాఖండ్ లోని  పాతాళ భువనేశ్వర్ అనే గుహ  దగ్గర శివుడు తన కొడుకు తలని ఖండించాడు. ప్రస్తుతం ఈ గుహ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ.. పోతూ ఉంటారట. ఈ గుహలోకి కొద్ది దూరం మాత్రమే పోవడానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ గుహ పాతాళ లోకానికి దారి అని చెబుతూ ఉంటారు. దాని లోపల భయంకరమైనటువంటి పాములు, ఇతర విష పురుగులు ఉంటాయి.

Advertisement

కానీ అక్కడ పార్వతి దేవి స్నానం చేసిన అందమైన కొలను మనకు కనిపిస్తుంది. అక్కడే పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి  ఆ గృహ ప్రధాన ద్వారం వద్ద కాపలా ఉంచింది. అదే సమయంలో శంకరుడు వచ్చి తన ఇంట్లోకి వెళ్దామన్న సమయంలో గణేష్ డు అడ్డుకుంటాడు ఈ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి శంకరుడు గణేశుడి తల తీసేస్తాడు. ఆ తల నరికిన తరువాత అది ఎక్కడో పడిపోతుంది. తన బటులను పంపిన కానీ దొరకలేదట. పార్వతి నాకు నా కొడుకు కావాలి బతికించమని వేడుకుంటే.. అప్పుడు ఏనుగు తల తీసుకొచ్చి ప్రాణం పోస్తాడు శివుడు. గణపతికి ప్రాణం పోసిన తరువాత ఒక రోజుకు అసలు తల దొరుకుతుంది. దానిని తీసుకొచ్చి బటులు పాతాళ భువనేశ్వర్ గుహలో ఉంచారని స్కంద పురాణంలో  వివరించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

భర్త మరో మహిళతో రిలేషన్ లో ఉన్నా తప్పులేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..!

Ganesh Chaturthi 2023 : వినాయక విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి…!

Visitors Are Also Reading