దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం ఎంతటి సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కి ఈ మూవీ ద్వారా గ్లోబల్ వైడ్ స్టార్ స్టేటస్ లభించింది. అంతేకాదు.. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. మన తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్ కి రీచ్ అయి ఆస్కార్ అవార్డు గెలుచుకునే స్థాయికి వెళ్తుందని అస్సలు ఎవ్వరూ ఊహించలేకపోయారు.
Advertisement
రాజమౌళి గత రెండి సినిమాలు బాహుబలి, బాహుబలి 2 సినిమాలకు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. కేవలం ఆస్కార్ అవార్డు మాత్రమే కాదు.. నేషనల్ అవార్డులలో కూడా ఈ చిత్రం ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇప్పుడు సౌత్ సౌత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డులలో కూడా RRR మూవీ సత్తా చాటింది. ఈ అవార్డులలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరన్ కూడా ఉత్తమ నటుడి కేటగిరిలో నామినేట్ అయ్యాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఈ అవార్డు దక్కింది. దుబాయ్ లో ఘనంగా నిర్వహించిన ఈ సైమా అవార్డుల ఫంక్షన్ కి ఎన్టీఆర్ హాజరై ఈ అవార్డుని అందుకున్నాడు. ఈ అవార్డుపై సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య పెద్ద గొడవనే జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే..? ఈ సినిమాకి ఉత్తమ నటుడి కేటగిరిలో రామ్ చరణ్ కి సైమా అవార్డు వచ్చిందని.. కానీ ఆయనకి జ్వరం రావడం వల్ల గత రెండు మూడు రోజుల నుంచి ఇంటి నుంచి బయటికి కదలడం లేదు.
Advertisement
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కి కూడా ఆయన బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకున్నాడని సమాచారం. ఇలాంటి సమయంలో ఆయన దుబాయ్ కి వచ్చేంత ఓపిక, సమయం లేనందున సైమా యాజమాన్యం కి తెలిపాడని అందుకే సైమా వారు జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న కొన్ని రిలయబుల్ సోర్స్ కూడా ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీని మీదనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతుంది. ఈ మూవీని చూసిన ప్రతీ ఒక్కరికీ రామ్ చరణ్ మెయిన్ హీరో అనే విషయం అర్థమవుతుందని ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్ తప్ప, అసలు క్యారెక్టర్ లేదని.. సపోర్టింగ్ రోల్ కి ఉత్తమ నటుడి క్యాటగిరిలో అవార్డు ఎలా ఇస్తారంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సైమా అవార్డ్స్ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈ హీరోల నిర్లక్ష్యంగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఇవే..!