Home » Kodali Nani : నందమూరి వారి పెళ్ళిలో కొడాలి నాని.. పిక్ వైరల్!

Kodali Nani : నందమూరి వారి పెళ్ళిలో కొడాలి నాని.. పిక్ వైరల్!

by Bunty
Ad

ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని… మొన్నటివరకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నందమూరి హరికృష్ణ సన్నిహితుడిగా పేరుపొందిన కొడాలి నాని… ఆయన ద్వారానే… మొదట తెలుగుదేశం పార్టీలో చేరి… గుడివాడ టికెట్ తెచ్చుకున్నాడు. అయితే నందమూరి హరికృష్ణ మరణం తర్వాత…. తెలుగుదేశం పార్టీని వీడి… వైసిపి పార్టీలో చేరారు కొడాలి నాని.

Kodali Nani at Nandamuri Suhasini son marriage photo viral

Kodali Nani at Nandamuri Suhasini son marriage photo viral

వైసీపీ పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు…. తెలుగుదేశం పార్టీ నేతలను బండ బూతులు తిడుతూ వచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి.. తొలిసారిగా మంత్రి అయ్యారు. అయితే… ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని… ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ను తిడుతూ ఉంటారు. అదే సమయంలో నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణను మెచ్చుకుంటూ ఉంటారు కొడాలి నాని.

Advertisement

Advertisement

ఈ తరుణంలోనే నందమూరి హరికృష్ణ కూతురు ఇంట్లో ఒక్కసారిగా కొడాలి నాని ప్రత్యక్షమయ్యాడు. ఇటీవల కాలంలోనే నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కొడుకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ కార్యక్రమంలో కొడాలి నాని ప్రత్యక్షమయ్యాడు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించాడు కొడాలి నాని. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading