Home » Prithvi Shaw : పాపం పృధ్వీ షాను.. శని దేవుడు అస్సడు వదలడం లేదుగా !

Prithvi Shaw : పాపం పృధ్వీ షాను.. శని దేవుడు అస్సడు వదలడం లేదుగా !

by Bunty
Ad

 

టీమిండియా ఆటగాడు పృద్విషాను శని దేవుడు వదలడం లేదు. అదృష్టం దగ్గరికి వచ్చేలోపే దురదృష్టం అతన్ని హత్తుకుంటుంది. కెరీర్ ప్రారంభంలో మంచి బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు పృద్విషా. అప్పట్లో షాని వీరేంద్ర సెహ్వాగ్ తో కూడా పోల్చారు. పడుతూ లేస్తూ సాగిపోతున్న పృద్విషా ఇటీవల డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. దేశవాళి వన్డేకప్ లో ఒక మ్యాచులో 244 డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టిస్తే… మరో మ్యాచ్ లో 125 అజేయ శతకంతో నాటౌట్ గా నిలిచాడు.

Prithvi Shaw

Prithvi Shaw

దీంతో అతనికి జట్టులో బెర్త్ కన్ఫామ్ అయినట్టే అని అందరూ భావించారు. అటు మాజీ ఆటగాళ్లు సైతం ఇదే కోరుకున్నారు. టీమిండియాలో చోటు దక్కకపోగా గాయాల రూపంలో మళ్ళీ దురదృష్టం వెంటాడింది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు పృద్విషా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. మోకాలి గాయం తీవ్రతరం కావడంతో కనీసం మూడేళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో దేశవాళీ సీజన్ లో కూడా కొంత భాగానికి పృథ్విష దూరం అవక తప్పేలా లేదు.

Advertisement

Advertisement

అక్టోబర్ 1 నుంచి జరిగే ఇరానీకప్ తో ఈ డొమెస్టిక్ సీజన్ మొదలవుతుంది. త్వరగా కోలుకుంటే మాత్రం ముంబై రంజి టీమ్ లో చోటు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. లేదంటే రంజి ట్రోఫీకి కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా టీమిండియా తరపున 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన పృద్విషా ఒకే ఒక టీ 20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంకతో టి20తో అరంగేట్రం చేయగా కరోనా శని రూపంలో వెంటాడింది. ఆ తర్వాత మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading