ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. వినాయకుడిని ఆరాధిస్తే, అంతా మంచి జరుగుతుంది. మన కష్టాలు తొలగిపోతాయి. విఘ్నాలు ఏమీ లేకుండా, మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇక మరో మూడు రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. వినాయక చవితి నాడు ప్రత్యేకించి, వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. హిందువులు అందరూ వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయకుని అనుగ్రహం కలగాలన్నా, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలన్నా కచ్చితంగా ఇలా చేయండి. అప్పుడు వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
వినాయకుడికి మోదుగ, లడ్డు, సింధూరముని సమర్పిస్తే చాలా మంచిది. సింధూరాన్ని వినాయకుడు ఎంతో ఇష్టపడతారు. బుధవారం నాడు, వినాయకుడిని సింధూరంతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. సింధూరం, నెయ్యి లేదా బెల్లం వేసి నూనె తో కలిపి వెండి లేదా బంగారు నాణెంపై వినాయకుడికి రాయాలి. ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి. వినాయకునికి మందారం పూలు, ఎర్రని పూలు అంటే ఇష్టం.
Advertisement
Advertisement
వీటిని వినాయకుడికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. అరటి పండ్లు కూడా వినాయకుడికి ఇష్టం. తెల్లటి పూలను వినాయకుడికి పెట్టండి. అలానే గరిక అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. ఆవు పేడతో చేసిన వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వస్తుంది. స్పటిక వినాయకుడిని పూజిస్తే దోషాలు పోతాయి. పసుపు వినాయకుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. మామిడి, వేప చెక్కతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఆరాధిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.
Also read:
- వినాయకుడుకు గరిక అంటే ఎందుకు అంత ఇష్టం..? పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే..?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు
- పవన్ కళ్యాణ్ గారు ఈ తొమ్మిది ప్రశ్నకు సింగిల్ వర్డ్‌లో సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నలు సంధించిన ఆర్జీవి..!