టాలీవుడ్ మోస్ట్ అవెయిటేడ్ మూవీ ఖుషి. ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సమంత, విజయ్ దేవరకొండ ఫర్పామెన్స్ తో పాటు శివ నిర్వాణ దర్శకత్వం, హేషామ్ అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ మూవీకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఖుషీ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నప్పటికీ విజయ్ సమంత ఖుషిగా లేరట. అయితే ఈ మూవీ చూసిన వారందరూ నాడికూట దోషం గురించి చర్చించుకుంటున్నారు.
Advertisement
ఈ చిత్రంలో విజయ్-సమంత పాత్రలు పెళ్లి చేసుకుంటే.. నాడి కూట దోషం వస్తుందని హీరోయిన్ తండ్రి చెబుతాడు. ఈ నాడి కూట దోషం ఉన్న వారి వైవాహిక జీవితం ఎక్కువ రోజులు ఉండదని.. ఇద్దరి మనస్పార్థాలు వస్తాయని.. పిల్లలు పుట్టరని సినిమాలో చూపిస్తారు. దీనిని నాగచైతన్య-సమంతకి లింక్ చేస్తున్నారు కొందరూ ఆడియన్స్. వీరికి కూడా నాడి కూట దోషం ఉండే ఉంటుందని.. అందుకే పెళ్లి జరిగిన మూడేళ్లకు కూడా పిల్లలు కాలేదని.. ఇద్దరి మధ్య మనస్పార్థాలు వచ్చాయని.. ఫైనల్ గా విడాకులు తీసుకొని విడిపోయారంటూ పోల్చుతున్నారు.
Advertisement
వాస్తవానికి హిందూ సంప్రదాయం ప్రకారం.. నాడి కూట దోషం ఉన్న వారు ఒక హోం నిర్వహిస్తారు. లేదంటే.. పెళ్లి చేయరు. కానీ నాగచైతన్య-సమంత పెళ్లి విషయంలో ఇలాంటి వాటిని చెక్ చేసుకోలేదని.. అందుకే వారికి డైవర్స్ అయ్యాయని పేర్కొంటున్నారు. ఒకవేళ నాగచైతన్య-సమంత నాడి కూట దోష నివారణ హోం చేస్తే.. కలిసే ఉండే వాళ్లు అంటున్నారు. అయితే దీనిని మరికొంత మంది ఆడియన్స్ కొట్టి పడేస్తున్నారు. చైతన్య-సామ్ మధ్య వచ్చిన వ్యక్తిగత సమస్యల వల్ల విడిపోయారు. అంతేకాదు.. వారికి ఎలాంటి దోషాలు లేవని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడు సమంత నటించిన ఖుషి మూవీలో నాడి కూట దోషం, పిల్లలు పుట్టకపోవడం, మనస్పార్థాలు వచ్చి విడిపోవడం వంటివి చూసిన తరువాత నాగచైతన్య-సమంత విడాకులు విషయమే గుర్తుకురావడం గమనార్హం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Pawan Kalyan : పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో దుమ్ములేపుతున్న పవన్ కళ్యాణ్ !
రెండు రోజుల్లో బిగ్ బాస్ షో ప్రసారం.. లాస్ట్ మినిట్ లో షాక్ ఇచ్చిన అంజలి పవన్..!