టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే. అయితే నిన్న ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో గెలిచి మంచి ఆరంభాన్ని అందుకున్న పాకిస్తాన్ జట్టు… సెప్టెంబర్ రెండవ తేదీన అంటే ఆదివారం రోజున టీమిండియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది.
Advertisement
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్టు ఐసీసీ టోర్నమెంట్లలో ఆడితే ఆ కిక్కే వేరు ఉంటుంది. అలాంటిది ఆసియా కప్ లో ఈ రెండు జట్లు తలపడితే క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. అయితే ఆదివారం రోజున జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఓ భారీ అడ్డంకి నెలకొంది. ఈ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండవ తేదీన ఈ మ్యాచ్ జరిగే కాండీ వేదికగా భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ మ్యాచ్ జరగడంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Advertisement
ఒకవేళ మ్యాచ్ జరిగిన డక్వర్తు లూయిస్ పద్ధతి ప్రకారం… ఓవర్లను పూజించే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భారీ వర్షం పడితే మ్యాచ్… పూర్తిగా రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి సెప్టెంబర్ రెండవ తేదీన ఏం జరుగుతుందో చూడాలి. కాగా… ఆసియా కప్ 2023 టోర్నమెంట్ లో ఆరంభ మ్యాచ్ లో నేపాల్ జట్టుపై పాకిస్థాన్ రికార్డు స్థాయిలో పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
గురూజీ కారణంగా ప్లాప్ అయిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా ?
ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకుని….ఆ పని కూడా చేస్తా – నగ్మా సంచలనం