టీమిండియా తరపున టన్నుల కొద్ది పరుగులు సాధించిన స్టార్ బ్యాట్స్మెన్ షికర్ ధావన్ ను పట్టించుకున్న వారే లేరు. ఒకప్పుడు ఓపెనర్ గా బరిలోకి దిగి పరుగుల వరద సాధించిన ధావన్ ను సెలెక్టర్లు కనికరించడం లేదు. ప్రస్తుతం టీమిండియా రెండు మెగా టోర్నీలకు సిద్ధమైంది. ఆసియా కప్ ఇప్పటికే ప్రారంభం అయింది. మరో నెల రోజుల తర్వాత ప్రపంచ కప్ జరుగుతుంది. ప్రపంచకప్ దేవుడెరుగు కనీసం ఆసియా కప్ లో నైనా గబ్బర్ ను ఆడించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఒకప్పుడు సేవ్ చేయడానికి ధోని ఉండేవాడు. కానీ ఇప్పుడు ధోని లేకపోవడంతో ధావన్ ఒంటరివాడిగా మిగిలిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆసియాకప్ కోసం మొత్తం 17 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే ఈ టీంలో శిఖర్ ధావన్ కు చోటు దొరక్కపోవడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. గత ఆసియా కప్ లో ధావన్ విధ్వంసమే సృష్టించాడు. ఆ రికార్డులు చూసి అయినా ధావన్ ను సెలెక్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 2018 టోర్నమెంటులో 9 మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలతో పాటు 534 పరుగులు సాధించాడు.
Advertisement
Advertisement
గత పదేళ్లుగా జట్టుకు ధావన్ ఎంతో చేశాడు. ఎన్నో మ్యాచ్లను ఒంటి చేతితో గెలిపించాడు. క్రిజులో ధావన్ ఉన్నాడంటే మ్యాచులో ఎలాంటి పరిస్థితులనైనా మన వైపు తిప్పగల సమర్ధుడు. అలాంటి సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టడం, పైగా తాజాగా ఆగార్కర్ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఓపెనర్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, గిల్ మాత్రమే అన్నట్లుగా అగర్కర్ మాట్లాడాడు. దాంతో ధావన్ టీమ్ ఇండియా కెరియర్ ముగిసినట్లుగా అభిప్రాయ పడుతున్నారు. ఇంతకుముందులా కాపాడడానికి టీమ్ లో ధోని కూడా లేరు. ఈ నేపథ్యంలో అతని కెరియర్ రిటైర్మెంట్ వైపే ప్రయాణిస్తుందా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకుని….ఆ పని కూడా చేస్తా – నగ్మా సంచలనం
హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !
ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?