మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయారు. అప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాలను పునర్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి… ఇటీవల బోలా శంకర్ తో సందడి చేసే ప్రయత్నం చేశారు.
Advertisement
అయితే వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకోగా…. బోలా శంకర్ సినిమా మాత్రం ఘోరంగా విఫలమైంది. సింపుల్గా చెప్పాలంటే అట్టర్ ఫ్లాఫ్ అయింది. నటీనటుల రెమ్యూనరేషన్ వాల్యూ కూడా కలెక్షన్లను రాబట్ట లేకపోయింది బోలాశంకర్.బోలా శంకర్ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తి సురేష్ ఆయన చెల్లెలిగా నటించింది.
Advertisement
ఈ నెలలో రిలీజ్ అయిన బోలా శంకర్… దారుణంగా బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టింది.అయితే బోలా శంకర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో… చిరంజీవి తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారట. వాస్తవానికి ఒక్క సినిమాకు మెగాస్టార్ చిరంజీవి 45 కోట్ల నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటారు. కానీ బోలా శంకర్ సినిమా ఫ్లాప్ కావడంతో… ఇకపై 35 నుంచి 30 కోట్ల మాత్రమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
Chiranjeevi : “ది ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ను రిజెక్ట్ చేసిన చిరంజీవి..?
Vijay Deverakonda : టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్న విజయ్ దేవరకొండ..?
ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?