ఏపీ మంత్రి రోజా భర్త దర్శకుడు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను చెన్నై జార్జ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కేసుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. తన సినిమాకు సంబంధించి ఒక ఫైనాన్షియర్ పై సెల్వమణి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లపై కోర్టులో కేసు ఉండగా దానికి సెల్వమణి హాజరు కాలేదు.
Advertisement
ఇతను ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ ముకుంద్ చంద్ గోత్ర అనే సినిమాకి సెల్వమణి దర్శకుడు. ఈ సినిమాకి ముకుంద్ అనే వ్యక్తి ఫైనాన్షియర్ గా వ్యవహరించాడు. కాగా, 2016లో ఒక కేసుకు సంబంధించి ఆయన అరెస్టు అయ్యాడు. దీంతో ఆయన వల్ల తాను కూడా ఇబ్బందులకు గురయ్యానని సెల్వమణి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Advertisement
సెల్వమణి ఇంటర్వ్యూలో అలా చెప్పడం వల్ల తన పరువుకు నష్టం కలిగిందని ముకుంద్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు వేసిన కొన్ని రోజులకు ఈ ముకుంద్ మరణించాడు. కాగా, ముకుంద్ కుమారుడు గగన్ గోత్ర ఈ కేసును నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరు కాలేదు. దీంతో వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.
ఇవి కూడా చదవండి
ఖుషి సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?
Mannara Chopra : డైరెక్టర్ అత్యుత్సాహం..మీడియా ముందే హీరోయిన్‌కు ము***ద్దు
హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !