Home » ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?

ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?

by Bunty
Ad

కమెడియన్ ఆలీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ ఇప్పుడు చాలా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆలీ నటనకు, తన కామెడీకి చాలామంది అభిమానులు ఉన్నారు. తన నటన, కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోగా కూడా నటించాడు. ఆలీ “యమలీల” సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా 1994లో రిలీజ్ అయింది.

Advertisement

ఈ సినిమా దర్శకుడు కృష్ణారెడ్డి. ఈ సినిమాలో ఆలీ నటన అద్భుతంగా ఉంది. కానీ ఈ సినిమా అనంతరం ఆలీ హీరోగా కన్నా కమెడియన్ గానే ఎక్కువ సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలో హీరోగా ఆలీ కన్నా ముందు మరొక స్టార్ హీరోని అనుకున్నారట. కానీ అతని వయసు చాలా తక్కువగా ఉండడంతో ఇప్పుడు చేయనని చెప్పుకొచ్చారట. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు. కృష్ణారెడ్డి మొదటగా ఈ సినిమా స్టోరీని కృష్ణ గారికి చెప్పారట. దీంతో కృష్ణగారు ఒకసారి బాబుని వచ్చి చూడండి అని చెప్పడంతో కృష్ణారెడ్డి వెళ్లి చూసేసరికి మహేష్ బాబు చాలా చిన్న వయసులో ఉన్నాడట.

Advertisement

ఆ సమయంలో మహేష్ బాబుకి నటనపరంగా అంత మెచ్యూరిటీ ఉండకపోవడంతో ఇతను సినిమాల్లోకి రావడానికి కనీసం ఇంకో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే మీరు ఇతన్ని సినిమాల్లోకి తీసుకురావద్దని కృష్ణారెడ్డి కృష్ణ గారికి చెప్పారట. దీంతో కృష్ణ కూడా నాకు కూడా ఇప్పుడు మహేష్ బాబుని సినిమాల్లోకి తీసుకురావాలని లేదు అని చెప్పారట. ఇక మహేష్ బాబుని వద్దనుకున్న తర్వాత ఈ సినిమాలో హీరోగా చాలా మందిని ఎంపిక చేసుకుని నటన సరిగ్గా లేకపోవడంతో వారిని రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా ఆలీ నటన బాగుండడంతో ఆలీని ఈ సినిమాలో హీరోగా ఫైనల్ చేశారట. దీంతో మహేష్ బాబు హీరోగా చేయాల్సిన సినిమాలో ఆలీ హీరోగా నటించారు.

ఇవి కూడా చదవండి 

ఇదేం క్రేజ్…అమెరికాలో సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్ !

చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

Visitors Are Also Reading