Home » చంద్రుడిపై చరిత్ర సృష్టించిన భారత్.. చంద్రయాన్ 3 కి ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

చంద్రుడిపై చరిత్ర సృష్టించిన భారత్.. చంద్రయాన్ 3 కి ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

by Anji
Ad

జయహో భారత్ అని ప్రతి ఒక్కరూ అనాల్సిందే. ఎందుకంటే భారతదేశం ఓ సరికొత్త రికార్డును  సృష్టించింది. భారత అంతరిక్షా పరిశోధన సంస్థ  ఇస్రో అంచనాలు మాత్రం తప్పలేదు. యావత్ భారత్ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. ఎవరు చూడని.. అడుగు మోపని చంద్రుడి భూభాగంలో భారత్ తొలి అడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుడి దక్షిణ దృవంలో అడుగు మోపిన తొలి దేశంగా ఘనత సాధించింది.

Advertisement

ఓటమి గెలుపునకు నాంది పలికింది.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్-2  వైఫల్యంతో మంచి పాఠాలే నేర్పింది. అందుకే చంద్రయాన్-3 లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీర్చిదిద్దింది. జులై 15వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఏపీలోని శ్రీహరి కోట నుంచి చేపట్టింది. ఎల్ వీఎం-3ఎం- 4 భూకక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఆ తరువాత 18 రోజుల వ్యవధిలో ఐదు సార్లు కక్ష్యను పెంచుకుంటూ పోసాగారు. ఆగస్టు 1వ తేదీన ట్రాన్స్ లూనార్ కక్ష్య.. 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు.ఆగస్టు 17వ తేదీన వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రేవత్ లో కూడిన ల్యాండర్ మాడ్యూల్.. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించడం ప్రారంభించింది. ఆ తర్వాత రెండుసార్లు డీ ఆర్బిట్ ప్రక్రియలు చేపట్టి జాబిల్లి ఉపరితలానికి చేరువ చేశారు.

Advertisement

దాదాపు 41 రోజుల ప్రయాణంలో అలిసిపోని విక్రమ్ ల్యాండర్.. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలను వమ్ము చేయలేదు. ఊహించినట్లుగా సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా ప్రయాణించి చంద్రుడిపై అడుగు మోపింది. సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్.. నిర్దేశించిన ప్రాంతానికి చేరింది. ఇస్రో  సైంటిస్టులు పంపించిన ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్ ను అనుసరించి.. తన కృత్రిమ మేధా సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. నాలుగు థ్రాటబుల్ ఇంజన్లను ప్రజ్వలించి వేగాన్ని తగ్గించుకుని.. రఫ్ బ్రేకింగ్ దశను ముగించుకొని చంద్రుడి ఉపరితలం చేరుకుంది.చంద్రుడికి ఏడున్నర ఎత్తు నుంచి ల్యాండింగ్ తన దిశను మార్చుకుంది. దశల వారీగా ఎత్తు తగ్గించుకుని.. ల్యాండింగ్ కు అనువైన ప్రదేశంలో కాలుమోపింది. తద్వారా అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. 

Manam News

 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ మిషన్ కోసం కేవలం $74 మిలియన్ల బడ్జెట్‌ను ఖర్చు చేసింది. అంటే భారత కరెన్సీ ప్రకారం.. 610 కోట్ల 64 లక్షల 68 వేల 900 రూపాయలను ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక  ఇతర దేశాలకంటే తక్కువ ఖర్చుతో భారత్ ప్రయోగాలు చేస్తోంది. రెండు వారాల కిందట ప్రయోగించబడిన రష్యాకు చెందిన లూనా-25 చంద్రుడిపైకి చేరడంలో విఫలమైంది. కక్ష్య నుంచి చంద్రుడిపై ల్యాండర్ ల్యాండ్ అవుతూ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగానికి రష్యా భారీగా నిధులు ఖర్చు చేసింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పుష్ప 2 మూవీ గురించి ఈ వార్త వింటే.. మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే..!

ఈ నాలుగు చెట్ల నీడ మన ఇంటిపై అస్సలు పడకూడదు…!

Visitors Are Also Reading