Home » భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ కీలక అప్డేట్.. అభిమానులకు పండుగే..!

భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ కీలక అప్డేట్.. అభిమానులకు పండుగే..!

by Anji
Ad

ప్రస్తుతం వరుస సక్సెస్ లో ఉన్నాడు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు బ్యాట్ టూ బ్యాక్ హిట్ అయ్యాయి. దీంతో బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. ఆయన సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. వినోదాత్మక పాత్రలో కనిపించనుందట. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంది. బాలయ్య లుక్స్ సైతం మెప్పించాయి. మూవీపై అంచనాలను పెంచుతున్నాయి.  నేలకొండ భగవంత్ కేసరి అంటూ బాలయ్య చెప్పే డైలాగులు గూస్ బంప్స్ మెప్పించాయి. 

Advertisement

ఈ మూవీపై అంచనాలను పెంచుతున్నాయి. నేలకొండ భగవంత్ కేసరి అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మరో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. ఇందులో టీమ్ అంతా బాలయ్య సినిమాల్లోని డైలాగ్ లు చెబుతున్నారు. అనిల్ రావిపూడి వరకు వచ్చే సరికి అందరూ డైలాగ్ లు చెబుతున్నారని పాట అప్డేట్ ఇస్తానని చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 01న కానీ ఫస్ట్ సింగిల్ విడుదల చేసే అవకాశముంది. ప్రధానంగా గణేష్ ఉత్సవాలపై వచ్చే సాంగ్ అని తెలుస్తుంది. 

Advertisement

వినాయకచవితి వచ్చే నెలలో ఉన్న నేపథ్యంలో దానిని పెట్టుకొని ఈ సాంగ్ ని విడుదల చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయని.. అందులో రెండు ముందుగానే విడుదల చేయనున్నారట. మరోపాట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాలుగో పాట మూవీలోనే చూపించబోతున్నారట. అది చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నారు. అఖండ నుంచి అది వర్క్ అవుట్ అవుతుంది. భగవంత కేసరితో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటున్నారట. ఈ మూవీలో నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నెగటివ్ రోల్ అని సమాచారం. షైన్ స్క్రీన్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ఈ మూవీని సాహు గార్లపాటి, హరీస్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Allu Arjun: సినిమాల్లోకి రాకముందు అల్లు అర్జున్ ఆ పని చేసేవాడా? మొదటి సంపాదన ఎంతంటే?

“భగవంత్ కేసరి” సినిమాకు ముందు హీరోగా అనుకున్నది బాలకృష్ణను కాదా? ముసలోళ్ల కథ అంటూ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో?

Visitors Are Also Reading