Home » Ada Sharma: నాకు అలాంటి అబ్బాయే కావాలి” అంటూ క్లారిటీ ఇచ్చేసిన ఆదా శర్మ!

Ada Sharma: నాకు అలాంటి అబ్బాయే కావాలి” అంటూ క్లారిటీ ఇచ్చేసిన ఆదా శర్మ!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఆదా శర్మ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా యూత్ హార్ట్ లో ప్లేస్ కొట్టేసింది. ఆ తరువాత తెలుగు నాట వచ్చిన అవకాశాలు తక్కువే అయినా.. ఈ అమ్మడికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆదా శర్మ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. హిందీ, కన్నడ, తమిళ, భాషల్లో కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఆదాశర్మ తొలిసారిగా 2008లో హారర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

ఈ సినిమాకు గాను ఆదాశర్మకు ఉత్తమ నటి అవార్డు లభించింది. తెలుగులో అంతగా గుర్తింపు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపే అడుగులు వేసింది. ఇతర భాషల సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ.. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటారు. టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ… కీలక పాత్రలో నటించిన “ది కేరళ స్టోరీ” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.

Advertisement

ఇది ఇలా ఉంటె.. రీసెంట్ గా ఆదా శర్మ తన ఇంస్టాగ్రామ్ వాల్ పై ఓ ఫోటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆదాశర్మ షర్ట్ మరియు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వాల్ పై పెయింట్ ఒకేలా ఉన్నాయి. దీనికి కాప్షన్ గా వాల్ ఫస్టా లేక షర్ట్ ఫస్టా అని ప్రశ్నించారు. దీనికి ఒక్కో నెటిజెన్ ఒక్కోలా కామెంట్ చేసారు. కానీ, ఓ అబ్బాయి మాత్రం మీకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటూ ప్రశ్నించాడు. దీనితో చిర్రెత్తిన ఆదాశర్మ నాలుగు కాళ్ళు, ఒక తోక ఉంటె చాలని సెటైరికల్ గా సమాధానం చెప్పారు.

మరిన్ని..

టాలీవుడ్‌ హీరోతో డేటింగ్‌లో సామజవరగమన హీరోయిన్‌ ?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading