అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుని తెచ్చుకున్నాడు. ఇతనికి ఏదైనా నచ్చిందంటే ఎన్ని కోట్ల డబ్బునైనా ఇచ్చేసి తన కోరికను తీర్చుకుంటాడు. చాలా లగ్జరీ లైఫ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అయితే ముఖేష్ అంబానీ తాజాగా ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన భవనాన్ని విక్రయించాడు. న్యూయార్క్ లో ఉన్న తన 2BHK అపార్ట్మెంట్ ను 74.53 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది.
Advertisement
అపర కుబేరుడు ఈ అపార్ట్మెంట్ ను అమ్మడం ఏంటని చాలామంది షాక్ అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనంలో ముకేశ్ అంబానీ నివాసం ఉంటున్నాడు. ముంబైలోని ఆంటీలియాలో ముఖేష్ అంబానీ విలాసవంతమైన ఇంట్లో నివాసం ఉంటున్నారు. దీని విలువ దాదాపు 15వేల కోట్లకు పైనే ఉంటుంది. ప్రపంచ కుబేరుడు తన ఆస్తిని ఎందుకు అమ్మేసాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరెవరి మధ్య డీల్ కుదిరింది అనేది తెలియరాలేదు. న్యూయార్క్ నివేదిక ప్రకారం ముకేశ్ అంబానీ న్యూయార్క్ లోని మాంగాటాన్ లో ఓ విలాసవంతమైన భవనాన్ని 74.53 కోట్లకు విక్రయించాడు.
Advertisement
ఈ అపార్ట్మెంట్ నది ఒడ్డున ఉంది. ఇందులో మూడు బాత్రూంలో, నాయిస్ ప్రూఫ్ విండోస్, కాస్ట్లీ ఫ్లోర్లు, చెఫ్ కిచెన్ ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన భవనం. ఈ భవనం 1919 నాటిది. దీనిని గతంలో సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరీ అనే పేరుతో పిలిచేవారట. ఇందులో చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సైతం నివాసం ఉంటున్నారు. అలాంటి విలాసవంతమైన భవనాన్ని ముఖేష్ అంబానీ విక్రయించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు తన హిస్టరీలో కొనుగోలు చేయడమే కానీ విక్రయించడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి
పాండ్యా బిగ్ షాక్…టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా!
Virat Kohli : క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ?