Home » సీఎం కేసీఆర్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం…!

సీఎం కేసీఆర్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం…!

by Bunty
Published: Last Updated on
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు అల్లు అర్జున్. ఇక పుష్ప-2 సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో కాస్త అంత తీరిక కూడా లేనంత బిజీగా మారిపోయాడు.

Advertisement

ఇందులో భాగంగానే కాస్త సమయాన్ని తన మామ కోసం కేటాయించి రంగంలోకి దిగాడు. నల్లగొండ జిల్లాలోని బంటు గూడెం గ్రామానికి అల్లు అర్జున్ వెల్లాడు. తన మామ బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం వద్ద ఓ ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించాడు. కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఈ ఫంక్షన్ హాల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని రకాల వసతులతో పాటు దాదాపు 1000 మందికి సరిపడా ఫంక్షన్ హాల్ ని ఏర్పాటు చేశారు.

Advertisement

ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి తన అల్లుడు అల్లు అర్జున్, మంత్రి జగదీష్ రెడ్డి అంతేకాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు పదివేల మందికి భోజనంతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికలలోనే చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లను సాధించి సాధించారు. తన స్వస్థతలమైన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఇలా తన మామ కోసం అల్లు అర్జున్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి 

 

ఆ స్టార్ హీరో కోసం 6 రోజులు అన్నం మానేసిన శ్రీదేవి…?

Virat Kohli : వరల్డ్‌ కప్‌ కోసం కోహ్లీకి డైమండ్‌ బ్యాట్‌..!

Visitors Are Also Reading