Home » “పుష్ప” విలన్ ఫహద్ ఫాజిల్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా…?

“పుష్ప” విలన్ ఫహద్ ఫాజిల్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా…?

by Bunty

 

ఫహద్ ఫాజిల్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. ఇతని తండ్రి డైరెక్టర్ కావడంతో చాలా సులభంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫహద్ ఫాజిల్ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. దీంతో ఇతనికి చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

హీరోగా నువ్వు అసలు పనికిరావు అంటూ చాలామంది కామెంట్లు చేశారట. దీంతో అతను సినిమాలకు గుడ్ బై చెప్పి అమెరికాలో చదువుకున్నాడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత సినిమాలకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. తనను అవమానించిన వారితోనే ఇతను గొప్ప నటుడు అనే పేరుని తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక “బెంగళూరు డేస్” సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఫాజిల్ కి భార్య పాత్రలో నజ్రియా నటించింది. ఇక తొలిచూపులోనే తనతో ప్రేమలో పడిపోయిన ఫాజిల్ తనని పెళ్లి చేసుకోమని నజ్రియాకి ప్రపోజ్ చేశాడు.

ఇక కొన్ని రోజులపాటు నజ్రియా… ఫాజిల్ ని తన వెంట తిప్పుకొని చివరికి ఓకే చెప్పింది. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో చాలామంది హీరోలు సినిమాలలో నటించడానికి భయపడితే…ఫాజిల్ మాత్రం వరుస పెట్టి సినిమాలను చేసుకుంటూ వాటిని ఓటిటిలో రిలీజ్ చేశాడు. అలా చాలామందికి ఫహద్ ఫాజిల్ ఉపాధిని కల్పించాడు. అందరు హీరోల్లాగా అందం లేకపోయినప్పటికీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి 

Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?

ఆ ఏడాది జీవితంలో చాలా కోల్పోయా.. నరేష్‌ తనయుడు ఎమోషనల్‌

తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు…!

Visitors Are Also Reading