Home » మహేష్ బాబు అతడు మూవీలో బ్రహ్మనందం పేరేంటో మీకు గుర్తుకుందా ?

మహేష్ బాబు అతడు మూవీలో బ్రహ్మనందం పేరేంటో మీకు గుర్తుకుందా ?

by Anji
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ సినిమాలలో ముందు వరుసలో ఉండే సినిమాలలో అతడు ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు అప్పటివరకు నటించిన సినిమాల్లో అతడు విభిన్నమైన సినిమా అనే చెప్పాలి. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఇందులో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. 

Advertisement

ఈ సినిమాలో మహేష్ బాబు, త్రిష నటన ప్రేక్షకులను మెప్పించింది. ఒక్కడు మూవీతో మాస్ హీరో అనిపించుకున్న మహేష్ ఆ తరువాత అతడు మూవీతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని అంతకంతకు పెంచుకున్నాడు. అతడు సినిమా థియేటర్స్ కంటే ఎక్కువగా టెలివిజన్ లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో నటించాడు. అతడు మూవీ కేవలం మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పించింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనతో పాటు బ్రహ్మనందం కామెడీ సీన్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా త్రిష, బ్రహ్మానందం, మహేష్ బాబు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాయి. 

Advertisement

athadu

ఇదిలా ఉండగా.. అతడు మూవీలో బ్రహ్మానందం పేరు ఏంటో మీకు తెలుసా ? ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వాస్తవానికి అతడు మూవీలో ఎక్కడ కూడా బ్రహ్మానందం పేరు చెప్పరు. కానీ ఒకే ఒక్క సీన్ లో మాత్రం బ్రహ్మానందం పేరు చెబుతారు. ఫస్ట్ టైమ్ బ్రహ్మానందం మహేష్ బాబుని కలిసిన సన్నివేశంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మహేష్ పార్థు అంటూ పరిచయం చేస్తాడు. అప్పుడే బ్రహ్మానందంను పేరు పెట్టి పిలుస్తారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అయితే అతడు సినిమాలో బ్రహ్మానందం పేరు కిట్టు. ఆ సీన్ లోనే బ్రహ్మానందం పేరు చెబుతారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ఆడియన్స్ కదలకుండా చూడటం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

హీరో సూర్య చిల్ట్రన్స్ ఎక్కడ చదువుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 హీరో ప్రశాంత్ సినిమా కెరీర్ నాశనం కావటానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading