Home » సుధామూర్తికి చాలా ఇష్టమైనా ప్రభాస్ సినిమా పాట ఏదో తెలుసా..?

సుధామూర్తికి చాలా ఇష్టమైనా ప్రభాస్ సినిమా పాట ఏదో తెలుసా..?

by Mounika
Ad

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కోట్ల ఆస్తికి అధిపతి అయిన ఆమె సింప్లిసిటీ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఇంటర్వ్యూల్లో ఆవిడ చెప్పే అనేక విషయాలపై ఎంతోమంది ప్రేరణ పొందుతుంటారు. ఇటీవల సుధామూర్తి వెజ్-నాన్ వెజ్ అంటూ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా సుధామూర్తి తనకు ఇష్టమైన తెలుగు సినిమా పాటేంటో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Advertisement

సుధామూర్తి తరచు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విలువైన విషయాలను షేర్ చేసుకుంటారు. కొంతకాలం క్రిందట తన కూతురి వల్లే రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయ్యాడంటూ సుధా మూర్తి వెల్లడించారు. ఆమె చేసిన ఆ కామెంట్స్ అప్పటిలో చాలా వైరల్ అయ్యాయి. అంతేకాదు వెజ్.. నాజ్ వెజ్ స్పూన్ అంటూ సుధామూర్తి చేసిన వ్యాఖ్యలు  చర్చనీయాంసంగా మారాయి . ఈ విషయాలన్నీ పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో కొన్ని విషయాలు పంచుకున్నారు యాంకర్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడగటంతో.. సుధామూర్తి తెలుగు సినిమా పాటలు అంటే కూడా ఎక్కువగా ఇష్టపడతానని చెప్పడం విశేషం .

మరి సుధామూర్తికి అంతగా ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటో తెలుసా..? ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమాలోని ‘కాటుక కళ్లను చూస్తే పోతుందే మతి పోతుందే’ పాట తనకి చాలా ఇష్టమని సుధామూర్తి మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఆ పాట ప్లే అవుతుంటే సరదాగా హమ్ చేస్తానని సుధా మూర్తి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం prabhas_ashok అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లు      ఆకట్టుకుంటుంది . ఇక ఈ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading