ఇంట్లో ఆడవాళ్లు తెలిసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కొందరికి సమయం లేకపోవడం వల్ల వారు ఎప్పుడు పడితే అప్పుడు కొన్ని పనులను చేస్తూ ఉంటారు. ఇంటికి సామాన్లు తెచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల సమయం దొరికినప్పుడు షాప్ కి వెళ్లి ఇంటి సామాన్లను తెచ్చుకుంటారు. ఇక ఇంట్లో ఆడవాళ్లు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంట్లో డబ్బును కోల్పోవలసి వస్తుంది. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…
Advertisement
ఉదయం పూట భర్త బయటకు వెళ్లిన వెంటనే తలుపు వేసేసి ఇల్లు ఊడవడం, శుభ్రం చేయడం వంటి పనులు చేయకూడదు. భర్త వెళ్లిన అనంతరం తలుపు వేయకుండా ఉండాలి. తలుపు తీసుకొని ఉండాలి. వారు ఆఫీస్ కి వెళ్లిన ఓ అరగంట తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే చాలామంది ఆడవారు వంట చేసిన వెంటనే వంటింటిని శుభ్రం చేస్తారు. అలా చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుందట. వంట వండిన వెంటనే శుభ్రం చేయడాన్ని వెంటనే ఆపేయండి. ఉతికిన బట్టలను తలకిందులుగా మడత పెట్టడం వల్ల కూడా మంచిది కాదు. కాస్త సమయం తీసుకునైనా వాటిని సరైన విధంగా మడత పెట్టాలి.
Advertisement
అలాగే భర్త పనికి వెళ్తున్న సమయంలో భార్యలు కోపం తెచ్చుకోవడం, వాధించడం వంటి పనులు చేయకూడదు. భర్త పనికి వెళ్లిన సమయంలో కోపం తెచ్చుకోవడం వల్ల చాలా అనర్ధాలు వస్తాయి. భర్త బయటకు వెళ్లిన సమయంలో గుమ్మం, వాకిలి శుభ్రం చేయకూడదు. గంటసేపు ఆగి శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇతరుల ఇంటికి అప్పుగా బియ్యం, పంచదార, ఉప్పు వంటివి అడగడం మానుకోవాలి. మన ఇంట్లో లేని సమయంలో కిరాణా షాప్ కి వెళ్లి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ బియ్యం, పంచదార, ఉప్పు అప్పు తీసుకోవడం వల్ల మంచిది కాదట. ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఇంట్లో డబ్బుకి లోటు ఏర్పడుతుందట. ఇకనుంచి అయినా ఆడవాళ్లు ఈ జాగ్రత్తలను పాటించాలి.
ఇవి కూడా చదవండి :
భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!
రేణు దేశాయ్ కి అంబటి కౌంటర్.. నువ్వు నిజమైన భారతీయ మహిళవు !
ఫ్యాన్స్ కు షాక్…క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై…?