ఈ మధ్య కాలంలో ఆరోగ్యంపై అందరికీ కాస్త అవగాహన పెరిగింది. ముఖ్యంగా ఏం తినాలి? ఏం తాగాలి అంటూ ఆరోగ్య ప్రయోజనాల గురించి వెతికి మరీ పట్టుకుంటున్నారు. ఈ తరుణంలోనే గ్రీన్ టీ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. దీనిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తేలడంతో ప్రతీ ఒక్కరూ గ్రీన్ టీ తాగుతున్నారు. ప్రధానంగా బరువు తగ్గాలనుకునేవారు.. అందమైన చర్మం కావాలనుకునే వారు గ్రీన్ టీని ఇష్టంగా తాగి ప్రయోజనాలను పొందుతున్నారు.
Advertisement
మంచిది కదా.. అని ఎప్పుడూ పడితే అప్పుడు అస్సలు తాగకూడదు. అలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని కెఫిన్, టానిన్స్ జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి. అలాగే పడుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోకూడదు. ఇందులో అమినో యాసిడ్స్ కండరాలను ఉత్తేజపరిచి నిద్రపోకుండా ప్రేరేపిస్తాయి. ఊబకాయంతో బాధపడేవారికి గ్రీన్ టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు పెరుగుతున్నట్టయితే గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
Advertisement
ఇందులో ఉండే కెఫిన్ కాటెచిన్ జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది. ఇదే కాదు.. రోజుకు రెండు కప్పుల మించి గ్రీన్ టీ తాగితే శరీరంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రీన్ టీ ఎప్పుడూ కూడా భోజనానికి అరగంట ముందు భోజనం తరువాత రెండు గంటల తరువాత తీసుకోవడం వల్ల చక్కని లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎక్సర్ సైజ్ చేసే వారు ముందే గ్రీన్ టీ తీసుకుంటే వర్కౌట్స్ ఎక్కువ సమయం పాటు చేస్తారు. గ్రీన్ టీ వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయి.. ప్రతీ రోజు దీనిని తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
తల్లి పాలు ఏ వయస్సులో మాన్పించాలో తెలుసా ?