ప్రజా గాయకుడు గద్దర్ ఇవాళ తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన శరీరంలో దాదాపు 26 ఏళ్లకు పైగా తుపాకి తూటా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తన వెన్నుపూసలో బుల్లెట్ ఉన్నప్పటికీ.. ఆ నొప్పి వేధిస్తున్నా గద్దర్ తన పాటల ప్రస్థానాన్ని మాత్రం ఆపలేదు. పాటల ప్రస్థానంతో పాటు తెలంగాణ పోరాటాన్ని కూడా కొనసాగించారు. ప్రజా సమస్యలపై తన పాటలతో అంకుశమై పోరాడారు. గద్దర్ శరీరంలో బుల్లెట్ ఎందుకు ఉంది ? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
బడుగు, బలహీన వర్గాలు అణచివేతకు గురైనప్పుడు వారికి అండగా నిలబడేది పాట. అలాంటి పాటను జనంలోకి బలంగా తీసుకెళ్లిన ప్రముఖుడు గద్దర్. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు. పీడిత ప్రజల వేదనను చూడలేక కాలమే గద్దర్ ను కన్నదని ఉద్యమకారులు పేర్కొంటారు. గద్దర్ పాటకు అంత శక్తి ఉంది మరీ. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం సాగించిన గద్దర్ ప్రజా యుద్ధనౌక అయ్యారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం 1969లోనే తన గొంతు వినిపించారు. మలి దశ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఘనత గద్దర్ కే చెల్లింది. ఉద్యమానికి ఒక ఊపిరి పోశారు. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ పేటలో జన్మించిన గద్దర్.. విద్యాబ్యాసం నిజామాబాద్, హైదరాబాద్ లో కొనసాగింది. చదువు పూర్తి చేసి 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగంలో చేరాడు. ఆ పీపుల్స్ వారు ఉద్యమంలో తన గొంతు వినిపించారు. మావోయిస్ట్ ఉద్యమంలోనూ తన గొంతు ఎత్తారు. 1987 కారంచేడు దళితుల Ha త్యలపై అలుపెరుగని పోరాటం చేశాడు. ఎర్ర రుమాలు చుట్టి,కర్ర చేతబట్టి ఆయన ఆడే ఆట, పాడే పాట ప్రజలు ఎంత సేపు అయినా ఎదురుచూసేవారు.
Advertisement
జన నాట్యమండలి స్థాపకుల్లో గద్దర్ ఒకరు. అణచివేత, ఆధిపత్యం, ప్రజా సమస్యలపై గళమెత్తిన గద్దర్ తో చాలా మంది కలిసి పని చేశారు. భువనగిరిలో బెల్లి లలితను దుండగులు చంపినప్పుడు బూటకపు ఎన్ కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు గద్దర్. అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసనకు దిగారు. 1997 ఏప్రిల్ 06న గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ లోని గద్దర్ నివాసం పై దాడి చేసి కాల్పులు జరిపారు. ఆ సమయంలో గద్దర్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆయన ప్రాణాలు దక్కవని అందరూ ఆందోళన చెందారు. కానీ వైద్యులు శస్త్ర చికిత్స చేసి గద్దర్ శరీరం నుంచి బుల్లెట్లను తొలగించారు. కానీ ఒక్క బుల్లెట్ మాత్రం శరీరంలోనే ఉండిపోయింది. దానిని తొలగిస్తే గద్దర్ ప్రాణానికే ప్రమాదం అని వదిలేశారు వైద్యులు. వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ గద్దర్ గొంతు మాత్రం ఆగలేదు. 15 రోజుల కిందట గద్దర్ ఆసుపత్రిలో చేరిన తరువాత కూడా ఆ బుల్లెట్ గురించి గుర్తు చేసుకున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పృధ్వీరాజ్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!
శంకర్ మూవీలో రామ్ చరణ్ పాత్రల పేర్లు ఇవే..!