ఐపీఎల్ టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు ఒక్క టోర్నమెంట్ కొట్టకపోయినా… బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఉన్న క్రేజ్ మరే జట్టుకు లేదు. దీనికి కారణం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్, డూప్లిసిస్, విరాట్ కోహ్లీ ఇలా ఎంతోమంది గతంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ జట్టులో విరాట్ కోహ్లీ మరియు డూప్లిసిస్ లాంటి స్టార్లు మాత్రమే ఉన్నారు.
అయినప్పటికీ ఈ జట్టుకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. అయితే ఐపీఎల్ 2023 టోర్నమెంట్లో ఘోరంగా విఫలమైన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా టీం డైరెక్టర్, అలాగే హెడ్ కోచ్గా ఉన్న మైక్ హుస్సేన్ , అటు బ్యాటింగ్ హెడ్ కోచ్ గా ఉన్న సంజయ్ బంగార్ ను వదిలి పెట్టేసింది బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం.
ఇక వారి స్థానంలో జింబాబ్వే దేశానికి చెందిన ఆండీ ఫ్లవర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు హెడ్ కోచ్ గా నియమించింది యాజమాన్యం. జింబాబ్వే దేశానికి చెందిన ఆండీ ఫ్లవర్… లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు మొన్నటి వరకు హెడ్ కోచ్ గా పని చేశారు. ఈ ఏడాది అతని కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో…ఆండీ ఫ్లవర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు హెడ్ కోచ్ గా నియమించింది యాజమాన్యం. ఇక ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో ఆండీ ఫ్లవర్ సారథ్యంలోనే…రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుకు వెళ్లనుంది.
ఇవి కూడా చదవండి
ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!
Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !