ప్రస్తుతం మన హీరోలు ఏడాదికి ఒక సినిమాతో ముందుకు రావడానికే నానా కష్టాలు పడుతున్నారు. ఇక రాజమౌళి శంకర్ లాంటి దర్శకులు అయితే రెండుమూడేళ్లకు ఒక్క సినిమా తీస్తూ ఉంటారు. కానీ అప్పటి హీరోలు మాత్రం ఏడాదికి పదిహేనుకు పైగా సినిమాలను విడుదల చేసిన రికార్డులు ఉన్నాయి. అలా ఏడాదికి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ 1970లో ఒకేసారి 16 సినిమాల్లో నటించారు. మరుసటి ఏడాది వాటిలో 11 సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాకుండా 1972లో ఏకంగా కృష్ణ హీరోగా నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.
Advertisement
నందమూరి తారక రామారావు 1964లో హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మొదటి సినిమా కర్నా కాగా చివరి సినిమా భక్త రామదాసు.
Advertisement
రెబల్ స్టార్ కృష్ణంరాజు 1974 లో 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాటిలో అన్ని సినిమాలూ మంచి విజయం సాధించడం చెప్పుకోదగ్గ విషయం.
మెగాస్టార్ చిరంజీవి 1980లో ఏకంగా 14 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాటిలో మొదటి సినిమా అగ్ని సంస్కారం కాగా చివరి సినిమా రక్త బంధం.
జగపతి బాబు ప్రస్తుతం పాజిటివ్ మరియు నెగెటివ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక జగపతి బాబు కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఒక సంవత్సరంలోనే ఆరు సినిమాలను విడుదల చేసేవారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ 1987వ సంవత్సరంలో ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ALSO READ : టాలీవుడ్ లో ఇద్దరు భార్యలు ఉన్న స్టార్ హీరోలు వీరే..!