Home » Naresh: రమ్య రఘుపతికి షాక్ ఇచ్చిన కోర్టు.. నరేష్‌ ఇంట్లోకి వెళ్లకుండా నిషేధం

Naresh: రమ్య రఘుపతికి షాక్ ఇచ్చిన కోర్టు.. నరేష్‌ ఇంట్లోకి వెళ్లకుండా నిషేధం

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ కొడుకు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ.. అనవసరమైన విషయాలను తెరపైకి తెస్తూ నరేష్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇటీవలే… తన భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ కు దగ్గరయ్యాడు నరేష్. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు నరేష్. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు మాత్రం వస్తున్నాయి.

Advertisement

ఇలాంటి తరుణంలోనే… మళ్లీ పెళ్లి అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు నరేష్ మరియు పవిత్ర లోకేష్. ఈ సినిమాకు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మేలో రిలీజ్ అయి.. ఇప్పుడు ఓటీటీ లో కూడా నడుస్తోంది. అయితే ఈ సినిమా నేపథ్యంలో తాజాగా నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరు సివిల్ కోర్టు లో… నటుడు మాజీ భార్య అయిన రమ్య రఘుపతి కి ఊహించని షాక్ తగిలింది.

Advertisement

నరేష్ మరియు పవిత్ర లోకేష్ హీరో హీరోయిన్లుగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాను థియేటర్లో మరియు ఓటీటీ లలో విడుదల ఆపాలని రమ్యరావు భూపతి వేసిన పిటిషన్ ను బెంగళూరు సివిల్ కోర్టు తాజాగా కొట్టివేసింది. సెన్సార్ బోర్డు ధ్రువీకరించిన తర్వాత సినిమాను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు రమ్య రఘుపతి పై నరేష్ వేసిన గృహ నిషేధం పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు… నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒకేరోజు రమ్య రఘుపతి కి రెండు షాక్ లు తగిలాయి.

ఇవి కూడా చదవండి

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

Visitors Are Also Reading