ప్రయాణాలన్నిటి లోకి విమాన ప్రయాణం కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మరియు ఎన్నో సందేహాలను, భయాలను కలుగ చేస్తూ ఉంటుంది. విమాన ప్రయాణం అలవాటు లేని వారికి కచ్చితంగా ఈ ప్రయాణం అంటే ఎంతో కొంత భయం కలుగుతుండడం సహజం. కొంతమంది విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో మాత్రమే భయపడుతూ ఉంటారు. అయితే.. విమానంలో ప్రతి నిర్మాణానికి ప్రత్యేకత ఉంది.
Advertisement
ఆకాశంలో ఎగరడానికి అవసరమైన విధంగా విమాన నిర్మాణం ఉంటుంది. నిజానికి మనం విమానం అంతా క్లోజ్ చేయబడి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ మీరు సరిగ్గా గమనిస్తే.. విమానానికి ఉండే కిటికీలకు చిన్న రంధ్రం ఉంటుంది. ఇలా రంధ్రం ఉంటె.. బయట నుంచి గాలి లోపలి వచ్చేయదా? అన్న సందేహం కలగడం సహజం. అసలు ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
విమానాలలో, కిటికీలకు మూడు పేన్లు ఉంటాయి. క్యాబిన్ మరియు బయటి నుంచి ప్రెషర్ ను మేనేజ్ చేయడంలో ఈ పొరలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్యాసింజర్ క్యాబిన్ మరియు పేన్‌ల మధ్య ఉండే ఒత్తిడిని మేనేజ్ చేయడానికి విండో కి ఓ చిన్న రంధ్రం పెడతారు. ఈ రంధ్రాన్ని “బీదర్ హోల్” అంటారు. ఈ రంధ్రం కిటికీ యొక్క బయటివైపు పేన్ ను గరిష్ట ఒత్తిడిని తట్టుకోగలిగేలా చేస్తుంది. దీనివలన విమానం సురక్షితంగా ప్రయాణిస్తూ ఉంటుంది.
మరిన్ని..
మహిళల్లో ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందట..3వది ముఖ్యం !
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !