ప్రముఖ దిగ్గజ ప్లేయర్లు టీం ఇండియాకు దూరం కావడంతో ఆ లోటు కనబడుతోంది. గతేడాది డిసెంబర్ లో పంత్ కు యాక్సిడెంట్ కావడంతో కొన్ని వారాలపాటు ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. టీమిండియా స్టార్ పెసర్ బుమ్రా కూడా వెన్నునొప్పి గాయంతో చాలా రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Advertisement
ఏడాది కాలంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ గుడ్ న్యూస్ చెబుతూ రిషబ్ పంత్, బుమ్రా త్వరలోనే జట్టులో భాగం కాబోతున్నారంటూ హెల్త్ రిపోర్టు విడుదల చేసింది. ఇలాంటి సమయంలో టీమిండియా వెటరన్ ఇషాంత్ శర్మ చేసిన వాక్యాలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఐపిఎల్ లో పంత్ కు చోటు దక్కకపోవచ్చు అని ఇషాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంత్ కు అయిన గాయాలు చిన్నవి కాదు.
Advertisement
తాను ఫిట్నెస్ సాధించాలంటే ఇంకాస్త సమయం పడుతుందని ఇశాంత్ అన్నారు. పంత్ ఐపిఎల్ లోనే కాదు వచ్చే వరల్డ్ కప్ లో కూడా ఆడటం కష్టమే అంటూ అభిమానులకు ఇషాంత్ షాక్ ఇచ్చారు. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థులపై అటాక్ చేయడంలో పంత్ తనకు తానే సాటి. టెస్టుల్లోను, టీ20 తరహాలో బ్యాటింగ్ ను జులిపిస్తారు. అంత ఆటను ఆస్వాదించడానికి అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఇశాంత్ శర్మ ఈ తరహా కామెంట్స్ చేయడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇవి కూడా చదవండి
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !
హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !