అధిక బరువు ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. బరువు తగ్గడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని రోజులు చేసిన తరువాత బరువు తగ్గినట్లే అనిపించినా.. మళ్ళీ బరువు పెరిగిపోతూ ఉంటారు. దీనికి కారణం నిలకడ లైఫ్ స్టయిల్ ను పాటించకపోవడమే. మన లైఫ్ స్టయిల్ లోనే చిన్న చిన్న మార్పులను చేసుకోవడం వలన ఈజీగా బరువు తగ్గచ్చు. బరువు తగ్గడం కోసం మీ లైఫ్ స్టైల్ లో ఈ చిన్న చిన్న మార్పులను చేసుకోండి.
Advertisement
సాధారణంగా మనం లంచ్ చేసిన తరువాత డిన్నర్ కి చాలా సమయం తీసుకుంటాం. మధ్యలో సాయంత్రం సమయంలో మనకి ఆకలి వేయడం సహజం. అయితే.. ఈ సమయంలో చాలా మంది స్నాక్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గార్లు, నూనెలో వేయించిన ఫ్రై ఐటమ్స్ ను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే.. ఇలాంటి అలవాట్లే బరువు పెంచడానికి, శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ ను పెంచడానికి కారణం అవుతుంటాయి.
Advertisement
- సాయం సమయంలో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. ప్రాసెస్డ్ ఫుడ్ జీర్ణ సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది.
- సాయంత్రాలు ఆల్కహాల్ కి దూరంగా ఉండండి.
- చీజ్ లో సోడియం, సంతృప్త కొవ్వు లు అధికంగా ఉంటాయి. చీజ్ లు ఉన్న ఫుడ్ సాయం సమయాల్లో తీసుకోవడం వలన బరువు ఎక్కువగా పెరుగుతారు. ఇది రక్తపోటు పెరిగేలా చేస్తుంది.
- ఎంత ఇష్టం ఉన్నా సాయం సమయాల్లో స్వీట్లు తినడం మానుకోండి.
- ఇక ఐస్ క్రీమ్స్ కూడా సాయంత్రం అయ్యాక తినడం మంచిది కాదు. ఇటువంటి వాటిల్లో చక్కెర ఎక్కువ ఉంటుంది. ఇది అనేక ఆవ్యాధులకు కారణం అవుతుంది.
మరిన్ని..
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !
హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !