అంకెలు, సంఖ్యల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వాలు, పరిస్థితులను అంచనా వేస్తూ జ్యోతిష్యం చెప్పడాన్ని న్యూమరాలజీ అంటారు. అలాగే.. అక్షరంతో మొదలయ్యే పేర్లని బట్టి కూడా వారి వ్యక్తిత్వాలు, స్వభావాలు ఎలా ఉంటాయో చెబుతుంటారు. ఈ ఆర్టికల్ లో “S” అక్షరంతో మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. న్యూమరాలజీ ప్రకారం S అక్షరం 1కి సమానం అవుతుందని చెబుతుంటారు.
Advertisement
ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నాయకులుగా జన్మిస్తారట. ప్రతిరంగం లోను వీరు విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులను విశ్వసనీయులుగా పరిగణించవచ్చు. వీరు చాలా సహజంగా, తాము ప్రేమించే వారిదగ్గర రొమాంటిక్ గా కూడా ఉంటారట. వీరికి ఖరీదైన బహుమతులు తీసుకోవడం కంటే ప్రవర్తన, చర్యల ద్వారా ప్రేమని వ్యక్తపరిస్తే ఇష్టపడతారట.
Advertisement
వీరి భావాలను వివరించడం కష్టం. వీరు అందరితోనూ తమ భావాలను పంచుకోరు. తమ సొంతం అనుకున్న వారి దగ్గర మాత్రమే ఓపెన్ గా ఉంటారు. ఈ అలవాటు వల్లే వీరు ఒక్కోసారి డిప్రెషన్ కి గురి అవుతూ ఉంటారు. వీరు చూడడానికి ఆకర్షనీయంగా ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఎమోషనల్ అవుతూ ఉంటారు. అలాగే వీరు ఉదార స్వభావులు. ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటె చూస్తూ ఉండలేరు. వీరు ఎప్పుడు తమ స్నేహితులను వదిలి పెట్టరు. తమ కంటే ఇతరుల గురించి వీరు ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. వీరికి ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుందట.
మరిన్ని..
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !
హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !
అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?