Home » అదే నేను చేసిన పెద్ద మిస్టేక్.. వైరల్ అవుతున్న ఆమని కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

అదే నేను చేసిన పెద్ద మిస్టేక్.. వైరల్ అవుతున్న ఆమని కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు వారికి బాగా సుపరిచితురాలైన నటి ఆమని. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా స్టార్ నటిగా ఆమని చక్రం తిప్పారు. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లోకి వచ్చాక.. కెరీర్ లో పీక్స్ కి చేరుకున్నాక ఆమె సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లారు. తిరిగి ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నారు. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమని పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

Advertisement

కోలీవుడ్ నిర్మాత ఖాజా మొహిద్దిన్ ను ఆమని పెళ్లి చేసుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె ఇంటిలోని వారు ఆమెకు వివాహం జరిపించేసారు. అయితే.. ఆ పెళ్ళితోనే ఆమె కెరీర్ ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే.. పెళ్లి తరువాత సినిమాలు వద్దని ఆమె భర్త, కోలీవుడ్ నిర్మాత ఖాజా మొహిద్దిన్ ఆమనీ కి కండిషన్ పెట్టారట. అయితే.. ఆమని కూడా అందుకు ఒప్పుకునే పెళ్లి చేసుకున్నారట. అయితే.. ఆ విషయం గురించి ఆమని ఇటీవల ప్రస్తావించారు.

Advertisement

నా జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ అదేనని వాపోయారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. సినిమాలను వదిలేసి పెళ్లి చేసుకున్నానన్నారు. అయితే.. పెళ్లి అయ్యిన తరువాత సినిమాలను వదిలేసినందుకు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. పిల్లలు పుట్టిన తరువాత ఆ బాధ కొంతవరకు తగ్గినప్పటికీ.. సినిమాలను వదిలేసానన్న ఫీలింగ్ ఉండేదని చెప్పుకొచ్చారు. పిల్లలు కొంచం ఇదిగాక.. తిరిగి తన భర్తని ఒప్పించి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ.. మరోవైపు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు.

మరిన్ని..

పవన్ కళ్యాణ్ కరాటే నేర్చుకోవడానికి గల అసలు కారణమేమిటో తెలుసా..!

‘బేబి’ వంటి గోల్డెన్ ఛాన్స్ ని ఈ యంగ్ హీరో మిస్ చేసుకున్నాడా ?

రష్మీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. రాత్రికి వస్తావా అంటూ..!

Visitors Are Also Reading