Home » బేబి మూవీకి హీరోయిన్ వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

బేబి మూవీకి హీరోయిన్ వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఏ సినిమా అయినా ప్రేక్షకులకు కంటెంట్ నచ్చాలే కానీ తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుంది. అందుకు ప్రత్యేక ఉదాహరణ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి బలగం మూవీ, తరువాత బేబీ సినిమా అని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినటువంటి ఈ సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేసి దూసుకువెళ్తున్నాయి. అలా నూతన దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన బేబీ మూవీ కూడా అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. అలాంటి ఈ సినిమాకి నటీనటులు ఎంత పారితోషకం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రలో నటించారు. సినిమా  మొత్తం వీరి ముగ్గురి చుట్టే తిరుగుతుంది. ఎవరికీ వారే వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో వైష్ణవి చైతన్య సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై మోసిందనే చెప్పవచ్చు. అలాంటి వైష్ణవి చైతన్య ఈ సినిమాకి కేవలం రూ.35లక్షలు మాత్రమే పారితోషికం తీసుకుందట. అదేవిధంగా దర్శకుడు సాయి రాజేష్ రూ.కోటి, ఆనంద్ దేవరకొండ రూ.85లక్షలు, విరాజ్ అశ్విన్ రూ.25లక్షలు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా దాదాపు రూ.50కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. 

Advertisement

చిన్న సినిమా అని విడుదల సమయంలో ఈ సినిమాను కొనడానికి కూడా బయ్యర్స్ ఎవ్వరూ ముందుకు రాలేదట. రెండు రోజులు గడిచిన తరువాత సినిమా పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ కావడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఈ సినిమా అటు దర్శకుడికి, ఇటు నిర్మాతకు, నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పెళ్లికి ముందే తల్లి కాబోతున్న లావణ్య ? వాస్తవమేనా..! 

ఈసారి దసరాకు ట్రయాంగిల్ ఫైట్.. బాలయ్య విజయం సాధించేనా ? 

గుంటూరు కారం మూవీలో మరో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతుంది..?

Visitors Are Also Reading