Home » రాజమౌళి కాదు.. ఇప్పుడు అంతా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించే చర్చ..!

రాజమౌళి కాదు.. ఇప్పుడు అంతా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించే చర్చ..!

by Anji
Ad

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు ఫ్యాన్స్ కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే ఉండేవారు. రాను రాను కాలం మారిపోయింది. బయటి సినీ ప్రపంచంతో తెలుగు పరిశ్రమకు సంబంధం లేకుండా ఉండేది. కానీ రాజమౌళి తెరకెక్కించినా బాహుబలి ద్వాారా ఈ ట్రెండ్ ను మార్చేశాడు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో యావత్ సినీ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది. ఇక్కడి నుంచి  కూడా మంచి సినిమాలు వస్తున్నాయని నిరూపించాయి.  తెలుగు దర్శకులు పాన్ ఇండియా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడు ఓ దర్శకుడు. 

Advertisement

ఆయన మరెవ్వరో కాదండోయ్.. కేవలం రెండు సినిమాలను మాత్రమే తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. తొలి సినిమా ఎవడే సుబ్రమణ్యం, రెండో సినిమా మహానటి. ఈ రెండు సినిమాల ద్వారా ఇలాంటి సినిమాలను ఇలా కూడా తీయవచ్చనే విదంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా మహానటి బయోఫిక్ అంటే ఎలా ఉంటుంది.. అసలు చూస్తారా అనే అనుమానాలు కలిగిన సమయంలో బయోఫిక్ అంటే ఇలా తీయాలంటూ ఓ ట్రెండ్ సెట్ చేశాడు నాగ్ అశ్విన్.

Advertisement

అల్లాటప్ప సినిమాలు చేయడని.. తీస్తే కుంభస్థలం కొట్టేవిధంగా ఉంటుందని మహానటితో తెలిసిపోయింది. కుంభస్థలం కొట్టే సమయం రాగానే వచ్చింది. అదే కల్కి2898 AD. నిన్ననే ప్రాజెక్ట్ కే కి టైటిల్ ప్రకటించారు.  ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించడం విశేషం. గ్లింప్స్ కే ఇలా ఉంటే.. ట్రైలర్ వస్తే.. అదే సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆచనలకు కూడా చిక్కడం లేదు.హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఉన్న ఈ సినిమా ఒక్క భారతదేశంలోనే కాదు.. అన్ని దేశాల్లో సంచలనం సృష్టించేలా ఉందని ఓ అంచనా వేయవచ్చు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 వామ్మో.. నిత్యామీనన్ అంత మంది హీరోలతో అలా చేసిందా..?

పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

Visitors Are Also Reading