డొమినికా వేదికగా వెస్టిండిస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించారు. రోహిత్ సెంచరీ సాధించి ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్ పై అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో టీమిండియా ప్లేయర్ గా రెండో స్థానంలో నిలిచాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది స్టార్ బ్యాటర్ ఎవరో కాదు.. టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. వెస్టిండీస్ పై అత్యధిక సెంచరీలు సాధించిన యాక్టివ్ ప్లేయర్లలో అతనిదే అగ్రస్థానం కావడం విశేషం.
రవిచంద్రన్ అశ్విన్
వెస్టిండీస్ పై రవిచంద్రన్ అశ్విన్ 12 ఇన్నింగ్స్ లు ఆడాడు. వీటిలో మొత్తం 4 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం భారత్ తరపున ఆడుతున్నటువంటి ఆటగాళ్లలో వెస్టిండిస్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
రోహిత్ శర్మ
ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ తొలి టెస్ట్ లో వెస్టిండిస్ పై సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండిస్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ 3 సెంచరీలను సాధించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీ :
భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని ఫార్మాట్ లో కూడా తనదైన ముద్ర వేస్తారు. కానీ వెస్టిండీస్ తో జరిగిన 20 టెస్ట్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కేవలం 2 సెంచరీలు మాత్రమే సాధించాడు.
అజింక్య రహానే :
వెస్టిండీస్ పై మొత్తం 11 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే 2 సెంచరీలు సాధించాడు. అయితే టీమిండియా ఆల్ రౌండర్ అగ్ర స్థానంలో ఉన్నాడనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సాధారణంగా ఎవ్వరైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు చెబుతారు. కానీ వీరిని అధిగమించి అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
RCB కెప్టెన్ గా కోహ్లీ.. మెంటల్ గా ABD.. మెక్కలమ్ కు కోచ్ ?